Sunday, July 13, 2025
HomeదైవంDevshayani Ekadashi 2025: దేవశయని ఏకాదశి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేస్తారు?

Devshayani Ekadashi 2025: దేవశయని ఏకాదశి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేస్తారు?

Significance of Tholi Ekadashi 2025: ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి.. నాలుగు నెలలపాటు అదే స్థితిలో ఉండనున్నారు. ఈకాలాన్నే చాతుర్మాసం అని అంటారు. ఈ సమయంలో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు నిషిద్ధం. అయితే శ్రీహరి యోగ నిద్రలో ఉన్నప్పుడు మహాదేవుడు సృష్టి పరిపాలన చేస్తాడు. అయితే భక్తులు ఈరోజున ఉపవాసం పాటిస్తూ శ్రీమహావిష్ణువును పూజిస్తారు. దీంతో వారు అన్ని పాపాల నుంచి విముక్తి అయి మోక్షం సిద్ధిస్తుంది.

- Advertisement -

దేవశయని ఏకాదశి ఎప్పుడంటే?
ఈ ఏడాది దేవశయని ఏకాదశి జూలై 06, 2025న వచ్చింది. పంచాంగం ప్రకారం, ఈ ఏకాదశి తిథి జూలై 05న సాయంత్రం 06:58 గంటలకు ప్రారంభమై జూలై 06న రాత్రి 09:14 గంటలకు ముగుస్తుంది. తిథి ఆధారంగా జూలై 06న ఉపవాసం పాటిస్తారు. ఆషాఢ ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిధి నాడు అంటే జూలై 07, 2025న విరమించాల్సి ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉపవాసం ముగించడానికి శుభ సమయం ఉదయం 05:29 నుంచి ఉదయం 08:16 వరకు ఉంటుంది.

దేవశయని ఏకాదశి పూజా ముహూర్తం
బ్రహ్మ ముహూర్తం: జూలై 06 ఉదయం 04:08 నుంచి 04:49 వరకు
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 11:58 నుంచి 12:54 గంటల వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 12:51 నుంచి 02:38 గంటల వరకు
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 02:45 నుంచి 03:40 వరకు
సంధ్యా ముహూర్తం: సాయంత్రం 07:21 నుంచి 07:42 వరకు
త్రిపుష్కర యోగం: రాత్రి 09:14 నుంచి 10:42 గంటల వరకు
రవి యోగం : ఉదయం 05:56 నుంచి రాత్రి 10:42 వరకు

హిందువులు ఏకాదశిని ఎంతో పవిత్రమై రోజుగా భావిస్తారు. ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, రెండోది కృష్ణపక్ష ఏకాదశి. సనాతన ధర్మం ప్రకారం, ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించడం వల్ల మీకు దేనికీ లోటు ఉండదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కెరీర్ అద్భుతంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News