Dhan Trayodashi- Diwali 2025:దీపావళి వేడుకలకు శ్రీకారం చుట్టే మొదటి రోజు ధన్ తేరాస్. దీన్ని ధన్ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే కృష్ణ పక్ష త్రయోదశి తిథిన జరుపుకుంటారు. ఈ రోజు సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకలైన లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవుడిని పూజించే ఆనవాయితీ ఉంది. ధన్ తేరాస్ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభసూచకంగా భావిస్తారు. ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి శుభం, సంపద తీసుకొస్తాయని నమ్మకం ఉంది.
కొన్ని వస్తువులు కొనకూడదని..
ఈ ఏడాది ధన్ త్రయోదశి పండుగ అక్టోబర్ 18వ తేదీ శనివారం జరగనుంది. దేశవ్యాప్తంగా హిందూ కుటుంబాలు ఈ రోజున ప్రత్యేక పూజలు, దీపారాధన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ధన్ తేరాస్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ఆరంభం కూడా. అయితే ఈ రోజు కొన్ని వస్తువులు కొనకూడదని పాతకాలం నుండి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే అవి ఇంటికి అశుభాన్ని తెస్తాయని విశ్వసిస్తారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/mars-transit-in-scorpio-brings-luck-for-three-zodiac-signs/
ఇనుము వస్తువులు మాత్రం..
సాంప్రదాయంగా ఈ రోజున బంగారం, వెండి, వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. కానీ ఇనుము వస్తువులు మాత్రం ఈ రోజున దూరంగా ఉంచాలని పెద్దలు చెబుతారు. ఇనుము శని దేవుడికి సూచికగా చెబుతారు. అందువల్ల ఈ రోజు ఇనుముతో చేసిన వస్తువులు కొనడం దురదృష్టాన్ని కలిగిస్తుందని నమ్మకం ఉంది.
స్టీల్ వస్తువులు..
ఇక స్టీల్ వస్తువులు కూడా ఈ రోజున కొనడం మంచిది కాదని భావిస్తారు. ఎందుకంటే స్టీల్ లోహం కూడా ఇనుముతో సమానమైనదే. ధన్ తేరాస్ రోజు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చని పురాణ నమ్మకం.
గాజుతో చేసిన వస్తువులు..
మరొక ముఖ్యమైన విషయం గాజుతో చేసిన వస్తువులు. గాజును రాహువు గ్రహంతో అనుసంధానిస్తారు. కనుక ఈ రోజు గాజు వస్తువులు కొనడం ప్రతికూల శక్తిని ఇంటికి ఆహ్వానించడమేనని చెబుతారు. పాజిటివ్ ఎనర్జీకి బదులుగా ఇంట్లో నెగటివ్ వైబ్స్ పెరగవచ్చని భావిస్తారు.
పదునైన వస్తువులు…
ధన్ తేరాస్ రోజు పదునైన వస్తువులు కొనకూడదన్న నమ్మకం కూడా ఉంది. సూదులు, కత్తెరలు, కత్తులు వంటి వస్తువులు కొనడం ఇంట్లో విభేదాలు, వాదనలు పెరగడానికి దారితీస్తుందని చెబుతారు. ఈ రోజు ఇలాంటి వస్తువులు ఇంట్లోకి తీసుకురాకపోవడమే మంచిదని పెద్దలు సూచిస్తారు.
పాత్రలు కొనడం మాత్రం …
ఈ రోజున పాత్రలు కొనడం మాత్రం శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ వాటిని ఖాళీగా ఇంట్లోకి తీసుకురావడం మాత్రం అశుభం అని నమ్మకం ఉంది. ఖాళీ పాత్రలు శూన్యతకు, ఆర్థిక లోటుకు ప్రతీకలుగా పరిగణిస్తారు. అందువల్ల కొత్త పాత్రలలో నాణేలు లేదా ధాన్యాన్ని వేసి ఇంట్లోకి తీసుకువెళ్ళడం శుభ సూచకంగా భావిస్తారు.
నల్లని వస్తువులను..
ధన్ తేరాస్ రోజు నల్లని వస్తువులను కూడా కొనకూడదని సంప్రదాయం చెబుతుంది. నల్ల రంగు నెగటివిటీకి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రోజు నల్లని దుస్తులు లేదా వస్తువులు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం కాదని నమ్మకం. అందుకే చాలా మంది ఈ రోజున తెల్లటి లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తారు.
నూనె, నెయ్యి…
అదేవిధంగా నూనె, నెయ్యి వంటి పదార్థాలను ఈ రోజు కొనడం కూడా అశుభంగా భావిస్తారు. ఆ పదార్థాలు అవసరమైతే పండుగకు ముందు రోజే కొనుగోలు చేయాలని పంచాంగాలు సూచిస్తున్నాయి. ధన్ తేరాస్ రోజున ఇవి కొనడం ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని నమ్మకం ఉంది.
Also Read:https://teluguprabha.net/devotional-news/jade-plant-brings-wealth-prosperity-and-positivity-at-home/
ధన్ తేరాస్ పండుగ అంటే కేవలం కొనుగోళ్లు మాత్రమే కాదు, అది కుటుంబంలో ఆనందాన్ని, సంపదను ఆహ్వానించే రోజు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవి పూజ చేయడం ముఖ్యమైన భాగాలు. పూజ సమయంలో ధన్వంతరి దేవుడికి తులసి దళం సమర్పించడం, కుటుంబ ఆరోగ్యానికి మంగళం కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం, ధన్ తేరాస్ రోజున సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవాన్ అమృతకళశంతో ప్రత్యక్షమయ్యారని చెబుతారు. అందువల్ల ఆయన్ని ఆయుర్వేద దేవుడిగా పూజించడం ఆనవాయితీగా మారింది.


