Saturday, July 6, 2024
HomeదైవంSita Devi cursed Ayodhya: అయోధ్యకు సీతమ్మ శాపం పోయిందా?

Sita Devi cursed Ayodhya: అయోధ్యకు సీతమ్మ శాపం పోయిందా?

స్మార్ట్ సిటీగా అన్ని హంగులూ రామజన్మ భూమికే సొంతం

తనను అగ్నిపరీక్ష చేయమని అడిగిన రాముడి విధానంతో కోపగించిన సీతాదేవి అయోధ్యకు శాపం ఇచ్చినట్టు అయోధ్య స్థల పురాణంలో భాగంగా చెబుతుంటారు. అందుకే ఇంతకాలం అయోధ్య ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అయోధ్య ప్రజలు కథలు కథలుగా వివరిస్తుంటారు. చూస్తుంటే ఇదంతా నిజమే అనేలా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ అయోధ్య చేరుకోవటానికి ఎయిర్ కనెక్టివిటీ లేదు, రైల్వేస్టేషన్-రైళ్లు అంతమాత్రమే, ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నంత ఘోరంగా ఇక్కడి రోడ్లు ఉండేవి. ఆఖరుకి ఇక్కడ ఉందామంటే కూడా మంచి హోటళ్లు, లాడ్జిలు లేవు, అన్నీ చిన్నచిన్నవే, కానీ ఇదంతా గతం.

- Advertisement -

ఇప్పుడు ఇక్కడ 100కు పైగా ఫైవ్ స్టార్ హోటళ్లు పెట్టేందుకు పలు సంస్థల యజమానులు అనుమతుల కోసం అప్లై చేసి కూర్చున్నారు. అంతేకాదు ఇప్పుడు అయోధ్య ఓ స్మార్ట్ సిటీ. అత్యాధునిక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సూపర్గా ఉన్న రైల్వే స్టేషన్, అద్దాల్లా మెరిసే రోడ్లు, అన్నిటికీ మించి రామ్ లల్లాకు (బాల రాముడు-రాముడు ఇక్కడే పుట్టాడు కాబట్టి ఇక్కడ ఉన్న విగ్రహం బాల రాముడిదే) అత్యద్భుతమైన గుడిని నిర్మిస్తున్నారు. జనవరి నెలలో ప్రారంభం కానున్న రామ్ లల్లా దేవాలయంతో పాటు సరయూ నదీ పరిసర ప్రాంతాలు, ఇక్కడ నిత్యం జరిగే పూజలు-ఉత్సవాలు ఇక భూమిపైన ఇలాంటి టెంపుల్ సిటీ లేనేలేదు అనిపించేలా ఉండబోతోంది.

రామజన్మ భూమి రాముడిదే అంటూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించినప్పటి నుంచీ ఇక్కడ ఒకటే భక్తజన సంద్రం కనిపిస్తోంది. పండుగ రోజుల్లో, సెలవు రోజుల్లో ముఖ్యంగా మంగళవారాలు అయోధ్యలో నడిచేందుకు కూడా వీలు పడనంత రద్దీ ఉంటోంది. ఇక ఆలయం ప్రారంభమయ్యాక దేశవిదేశాల్లోని రామ భక్తులతో ఈ ప్రాంతం రామ నామ స్మరణతో మారుమోగిపోనుంది.

ఈ సందడి అంతా చూసి, జరుగుతున్న అభివృద్ధి చూసి సీతాదేవి శాపం ఎట్టకేలకు తొలగిపోయిందని స్థానికులు మురిసిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News