భద్రాచలం( తెలుగు ప్రభ ) పితృముక్తి క్షేత్రమైన భద్రాచలంలో మహాలయ పితృపక్షాలలో భక్తుల కోలహాలం జై జై దానాలతో భద్రాచలం గోదావరి మాత నదిహారతి పురోహితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని రామ వజ్జల రవికుమార్ అన్నారు. ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో భక్తుల జైశ్రీరామయ నమః అని శ్రీరామ స్మరణతో గోదావరి నదికి భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు.
అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులు శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామాను గ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు. లోక కళ్యాణార్ధం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి నదిహారతితో తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాలలో సశస్యామనం కావాలని పురోహితులు గోదావరి మాతను ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, రామవజ్జల రవికుమార్, సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం, నైవేద్యం, శనగలు భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి భద్రాద్రి పురోహితుల సంఘం తరపున అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య ప్రసాద్ శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, తేజ శర్మ, చంద్రశేఖర్ శర్మ, తిరుపతిరావు, శివ, తదితరులు హారతులు సమర్పించగా సత్యనారాయణ రెడ్డి మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.


