Saturday, November 15, 2025
HomeదైవంZodiac Signs: లక్‌ అంటే వీరిదే.. దీపావళి తర్వాత మాములుగా లేదుగా..!

Zodiac Signs: లక్‌ అంటే వీరిదే.. దీపావళి తర్వాత మాములుగా లేదుగా..!

Diwali 2025 Lucky Zodiac Signs:ఈ ఏడాది దీపావళి పండుగ మరో 15 రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి దీపావళికి ఖగోళ పరిస్థితులు కూడా మారబోతున్నట్లు పండితులు వివరిస్తున్నారు.శుక్ర,శని గ్రహాలు కలసి ఏర్పరిచే శక్తివంతమైన యోగం కారణంగా కొందరి జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోనే అవకాశాలున్నట్లు పండితులు వివరిసత్ఉన్నారు. ఇలా గ్రహ సంయోగం చేయడం వల్ల ఐదు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టనుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రాశులు మకర, వృషభ, మీన, తుల, కుంభ రాశుల వారికి పండగ తర్వాత వీరి జీవితం ఏవిధంగా మలుపు తిరగనుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

మకర రాశి…

మకర రాశి వారికి ఈ దీపావళి ఎంతో శుభంగా ఉండనుంది. శని, శుక్ర ప్రభావం వీరిని ఆర్థికంగా ముందుకు తీసుకుని వెళ్లబోతుంది. గతంలో ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, ఇక నుంచి వారి ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మంచి అవకాశాలను అందుకుంటారు. ఇంటిలో అనుకూల వాతావరణం ఏర్పడి, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరగనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వీరి చేతిలో ఉన్న పనులన్నీ లాభదాయకంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: https://teluguprabha.net/devotional-news/shani-budha-shadashtak-yoga-on-october-5-brings-fortune/

వృషభ రాశి…

వృషభ రాశి వారికి ఈ సారి అదృష్టం తలుపు తట్టనుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. చదువులో శ్రమిస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి వాతావరణం సానుకూలంగా మారి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త అవకాశాలు లభించి, భవిష్యత్తు పట్ల ఉత్సాహం పెరుగుతుంది.

మీన రాశి..

మీన రాశి వారికి ఈ దీపావళి తర్వాత ఆర్థికంగా అనుకోని లాభాలు దక్కవచ్చు. గతంలో ఊహించని చోటు నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో వీరి ప్రతిష్ట పెరుగుతుంది. చాలా కాలంగా విదేశీ ప్రయాణం చేయాలని కోరుకున్నవారి కోరిక ఈసారి నెరవేరే సూచనలు కనపడుతున్నాయి. చదువులో శ్రద్ధ పెట్టిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

తుల రాశి..

తుల రాశి వారికి దీపావళి తర్వాత ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి. చాలాకాలంగా వసూలు అవ్వని బాకీలు తిరిగి లభించే అవకాశం ఉంది. కొంతమంది స్థిరాస్తి కొనుగోలు చేయాలని అనుకున్నవారి కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి పండుగ తర్వాత సంతోషకరమైన సమయం ఎదురవుతుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-rules-about-donations-and-items-to-avoid-giving/

కుంభ రాశి..

కుంభ రాశి వారికి ఈ కాలం ఎంతో అదృష్టదాయకంగా మారనుంది. శుక్ర, శని గ్రహాల ప్రభావం కారణంగా కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారం చేసే వారికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సరైన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సానుకూలంగా మారి, ప్రతి పని సాఫీగా సాగనుంది. వీరి శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చే సూచనలు కనపడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad