Shani Budha Conjunction:ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20, 2025న జరగనుంది. ప్రతి ఏడాది ఈ పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈసారి జ్యోతిషశాస్త్రపరంగా దీపావళి మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ద్రుక్ పంచాంగం ప్రకారం దీపావళి రోజున శనిగ్రహం, బుధగ్రహం ఒకే రాశిలో సంయోగం ఏర్పరచుకోబోతున్నాయి. ఈ అరుదైన సంయోగం నవపంచ రాజయోగంగా పిలుస్తారు. జ్యోతిషులు ఈ యోగాన్ని శుభప్రదమైనదిగా పేర్కొంటున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం బలంగా పనిచేసి కొత్త అవకాశాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
క్రమశిక్షణ, కష్టపడి సాధనను..
గ్రహాల సంయోగాలు మనుషుల జీవితం మీద ప్రభావం చూపుతాయని భారతీయ జ్యోతిష్యం చెబుతుంది. శని క్రమశిక్షణ, కష్టపడి సాధనను సూచిస్తాడు. బుధుడు చురుకుదనం, మేధస్సు, వ్యాపారవేధనలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు కలిసే సందర్భంలో ఏర్పడే శక్తి వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చని నమ్మకం. దీపావళి రోజున జరుగుతున్న ఈ శుభసంయోగం ముఖ్యంగా మకర, కర్కాటక, వృషభ రాశుల వారికి మరింత అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/angasphurana-meaning-for-women-body-part-twitching/
మకర రాశి..
మకర రాశివారికి ఈ సంయోగం చాలా శుభప్రదంగా చెబుతుంటారు. శని స్వగ్రహంలో ఉండటం వలన ఈ సమయంలో మకరరాశి వ్యక్తులకు అదృష్టం బలంగా పనిచేస్తుంది. వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగరంగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాల నుంచి బయటపడతారు. ఆకస్మిక లాభాలు లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దాంపత్యంలో ఉన్న సమస్యలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఈ సంయోగం మకరరాశివారికి ఆత్మవిశ్వాసం పెంచి, భవిష్యత్తులో స్థిరమైన పురోగతికి దోహదం చేస్తుందని చెబుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఈ అరుదైన యోగం లాభదాయకంగా ఉంటుంది. చాలా కాలంగా ఆలస్యమవుతున్న పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు అవకాశాలు లభించి, వారి స్థానం బలపడుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి వ్యక్తుల కోసం ఈ యోగం కొత్త ఆరంభాలకు దారి తీస్తుంది.
వృషభ రాశి..
వృషభ రాశి వారికి ఈసారి దీపావళి మరింత ప్రత్యేకతను అందించనుంది. వృషభరాశి వ్యక్తులు చేపట్టే పనులు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి రంగంలో పురోగతి సాధించవచ్చు. వ్యాపారంలో లాభాలు అధికంగా లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు రావచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగి, పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది.
శని, బుధుల కలయిక కేవలం ఈ మూడు రాశులకే కాకుండా మిగతా రాశులపైనా కొంతమేర ప్రభావం చూపనుంది. అయితే ప్రధానంగా మకర, కర్కాటక, వృషభరాశులకే అనుకూలత ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల కొందరికి ఆర్థికంగా బలపడే అవకాశం ఉండగా, మరికొందరికి మానసిక శాంతి కలుగుతుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. కెరీర్‌లో నిలకడ సాధించే వీలుంటుంది.


