స్వప్నశాస్త్రం అనేది మన కలల వెనుక ఉన్న అర్థాలు, సంకేతాలను విశ్లేషించే ప్రాచీన శాస్త్రం, ఇది భవిష్యత్, ఆంతరంగిక పరిస్థితులు, వచ్చిన సంకేతాలు గురించి ఆధ్యాత్మికంగా విశదీకరిస్తుంది. ఈ థనంలో మనం నిత్యం చూస్తున్నా సరిగ్గా అర్థం చేసుకోని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో కలలు సహజం. కొన్ని సార్లు అవి అర్ధం లేని అనుభూతిలా అనిపించవచ్చు కానీ కొన్ని కలలు మన భవిష్యత్తుని స్పష్టంగా సూచిస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం, కొన్ని కలలు మనకి ధనసంపద కలిగిస్తాయంట. అలాంటి అదృష్టాన్ని చెప్పే కలల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కలలో వెలుగుతో దీపం కనిపిస్తే శుభ సూచకం అని పండితులు అంటున్నారు. దీపం అంధకారాన్ని తొలగించేటట్టు, మీ జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయని, శుభకాలం ప్రారంభమవుతుందని సంకేతిస్తుందంట. ఇలాంటి కల వస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుందని చెబుతున్నారు. ఇక కలలో చెవుల్లో ఆభరణాలు ధరించడం చూసినట్లైతే, అది మీకు అణుకోకుండా డబ్బు వచ్చేందుకు సూచిక అని చెబుతున్నారు. పొదుపు పెరిగే సూచనగా, మీ ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు.
చేతికి ఉంగరం వేసుకున్నట్టు కలలో కనిపిస్తే అది లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతమంట. మీపై ఆమె అనుగ్రహం ఉండి, ఆర్థికంగా మీరు స్థిరంగా మారుతారని దీనికి అర్థమంటున్నారు పండితులు. అంతేకాదు గులాబీ, కమలం పువ్వులు లక్ష్మీ దేవికి ప్రీతికరమైనవని చెబుతుంటారు. వీటిని కలలో చూడటం ఓ మంచి పరిణామానికి సంకేతమంట. ఇవి కలలో వస్తే మీ పనులు విజయవంతంగా జరుగుతాయని, ధనసంపద చేరుతుందని భావించాలని అంటున్నారు పండితులు.
అంతేకాదు కలలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే ఆరోగ్యంతో పాటు ఆస్తి, శాంతి మీ జీవితంలోకి వస్తాయనే సంకేతమని చెబుతున్నారు పండితులు. ఇది ఇంట్లో శుభవాతావరణం ఏర్పడుతుందని కూడా చెబుతుందంట. ఇక పామును కలలో చూసినప్పుడు భయం కలిగినా, ఇది నిజానికి ఓ శుభ సూచకం. పెద్ద లాభం, వ్యాపార విజయాలు లేదా ఆస్తి లభించే అవకాశాన్ని ఇది సూచిస్తుంది. ఇలా కొన్ని కలలు మనకి ముందుగానే సంకేతాలు ఇస్తుంటాయని పండితులు చెబుతున్నారు. మనం వాటిని సరైన దృష్టితో చూడగలిగితే, మన జీవితంలో వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించి ఉపయోగించుకోవచ్చు.
(గమనిక: ఈ కథనం నిపుణులు, మతం, పండితులు చెప్పిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)