HomeదైవంManthras: మంత్రం.. నిజంగా చింతకాయలు రాలుస్తుందా...?

Manthras: మంత్రం.. నిజంగా చింతకాయలు రాలుస్తుందా…?

Manthras: “ప్రతి మంత్రంలో ఓం కారం, బీజాక్షరాలు ఒక అమరికతో ఒకొక్క శక్తిని ప్రేరేరింప చేసేవి గా వుంటాయి. ముందుగా ఓం కారం గురించి చూస్తె అది “ అ ” కార, “ ఉ ” కార, “ మ ” కార సంగమం. ఆకారం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన వాణి కడుపు, హృదయం స్థానంలో చలనం గమనించవచ్చు. ఉ కార ఉచ్చారణతో గొంతులోను, మరియు గుండె దగ్గర మనం సెన్సేషన్ గమనించవచ్చు. “ మ్ ” అని అంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుండి మెదడు వరకు వైబ్రేషన్స్ గమనించవచ్చు.

- Advertisement -

కేవలం ఓం కార మంత్రోచ్చారణ ద్వారా మానసిక ప్రశాంతత, కాన్సంట్రేషన్ పెరుగుదల, ఎక్కువ ఉత్సాహం, స్ట్రెస్ తగ్గుదల కనబడ్డాయి. ఎమ్మారై స్కాన్ ద్వారా మరికొన్ని విషయాలు శాస్త్రవేత్తలు గమనించారు. . కానీ కొందరు వెటకారంగా “మంత్రాలకు చింతకాయలు రాల్తాయా!” అని ఎద్దేవా చేస్తారు. అసలు మంత్రం, దాని వెనకున్న నిగూడార్ధం గురించి చర్చిద్దాం! మనకు అనుభవంలో ఏది రాగలదో తెలుసుకుందాం! ”

మంత్రం దాని వెనుక ఉన్న రహస్యం
“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” – అనగా మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అదీ గురువుల సత్ ఉపదేశంతో నేర్చుకుని మననం చేస్తే ఎన్నో బాధలను తీర్చగలదు. ఎన్నో కార్యాలను సఫలం చెయ్యగలదు. కానీ కొందరు వెటకారంగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా! అని ఎద్దేవా చేస్తారు. అసలు మంత్రం, దాని వెనకున్న నిగూడార్ధం గురించి తెలుసుకుందాం!

మానసిక శక్తిని మరింతగా పెంచే *”ఓంకారం”
ప్రతీ మంత్రంలో ఓం కారం, బీజాక్షరాలు ఒక అమరికతో ఒకొక్క శక్తిని ప్రేరేరింప చేసేవి గా వుంటాయి. ముందుగా ఓం కారం గురించి చూస్తె అది “ అ ” కార, “ ఉ ” కార, “ మ ” కార సంగమం. ఆకారం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన వాణి కడుపు, హృదయం స్థానంలో చలనం గమనించవచ్చు. ఉ కార ఉచ్చారణతో గొంతులోను, మరియు గుండె దగ్గర మనం సెన్సేషన్ గమనించవచ్చు. “ మ్ ” అని అంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుండి మెదడు వరకు వైబ్రేషన్ గమనించవచ్చు.
ఇది ఎక్కడో ఎందుకు మీరే ఒకసారి ఉచ్చరించి చూడండి. ఆ కదలికలను మీరు ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రదేశాలలో చలనం గమనించవచ్చును. ఇవి మూడు కలిపి ఓం కారం జపించినప్పుడు కటి ప్రదేశం నుండి మెదడు వరకు, మనకున్న షట్చక్రాలు ఉత్తేజితం అవుతాయి.

ఈ ఓం కారానికి ఫ్రీక్వెన్సీ 425 హెచ్ జడ్ గా గుర్తించారు. అదే ఓం కార మంత్రోచ్చారణ ఒక క్రమపద్ధతిలో చేసేవారికి బినురల్ వేవ్స్ మెదడు లో తయారవుతాయి. దాని వలన ఆల్ఫా (8-13.9 హజ్), బీటా(14-30 హజ్) ,టీటా _(4-7.9), డెల్టా ( _0.1-3.9 హజ్) తరంగాలు మెదడులో ఉత్పన్నమవుతాయి. సైంటిస్ట్ లు దీని మీద ప్రయోగాలు చేసి ఓం కార ఉచ్చారాణ ద్వారా ఒకరి మానసిక స్థితి బీటా నుండి డెల్టా వరకు ప్రశాంతత స్థితికి వెళ్తుంది. మానసిక ఒత్తిడి ఓం కార ఉచ్చారణ ద్వారా ఎలా తగ్గుతుందో జ్ఞాన భాండాగారాలైన మన వేదాల్లో మరింత వివరంగా చర్చించబడి వుంది. కేవలం ఓం కార మంత్రోచ్చారణ ద్వారానే మానసిక ప్రశాంతత, కాన్సంట్రేషన్ పెరుగుదల, ఎక్కువ ఉత్సాహం, స్ట్రెస్ తగ్గుదల కనబడ్డాయి. ఎమ్మారై స్కాన్ ద్వారా మరికొన్ని విషయాలు గమనించారు. దీని ద్వారా ఎపిలేప్సి, డిప్రెషన్ కూడా తగ్గించవచ్చు అని నిర్ధారణకు వచ్చారు.

కొన్ని బీజాక్షరాల సమాహారమే మంత్రాలు
ఇక మనం మిగిలిన మంత్రాల విషయం గురించి చూద్దాం. ప్రతి మంత్రం కొన్ని బీజాక్షరాల సమాహారం. ప్రతీ బీజాక్షరానికి దాని శక్తి వుంటుంది. దానికి తత్సంబంధిత ఒక ఫ్రీక్వెన్సీ వుంటుంది. ఈ బీజాక్షరాల క్రమపద్ధతి లో దాత్త, అనుదాత్త స్వరాలతో చదివినప్పుడు ఒక సంకేతం ఉత్పన్నం అవుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. తత్సంబంధిత దేవతా స్వరూపానికి అది చేరి రావలసిన ఫలితం ఇప్పిస్తుంది. ఇదెలా కుదురుతుంది? అని అనుకుంటే దానికి అర్ధమయ్యే ఒక ఉదాహరణ తీసుకుందాం. దీన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే మనం ముందు మన చుట్టూ మనకు అర్ధం కానీ, ఎన్నో తరంగాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి.

మంత్రాల తరంగాలు అర్థం కావాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవాలి
ఉదాహరణకు రేడియో లో ఎఫ్ ఎం ట్యూన్ చెయ్యాలంటే 88-108 ఎం హెచ్ జడ్ లో మార్చుకోవాలి. అందునా దానికి సైట్ లైన్ మాత్రమే ఆ సిగ్నల్ ట్యాప్ చెయ్యగలదు. అందుకే వైజాగ్ ఎఫ్ ఎం రేడియో వేరు, విజయవాడ ఎఫ్ ఎం రేడియో స్టేషన్ వేరు. ఒకొక్క ఊరిలో ఆ ఎఫ్ ఎం సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ని అందుకోవాలంటే దానిని అర్ధం చేసుకునే ఎఫ్ ఎం రిసీవర్ ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీ కి మనం ట్యూన్ చేసుకుంటే ఆ కార్యక్రమం మనం వినగలం. అదే రేడియో ఏ ఎం అంటే కొన్ని లాటిట్యూడ్ వరకు వ్యాపిస్తుంది. అందుకే మనం శ్రీలంక రేడియో కూడా వినగలం. అలాగే శాటిలైట్ రేడియో ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కార్యక్రమం కూడా వినవచ్చు. వాటికి తత్సంబంధిత రిసీవర్ తప్పని సరి!

మంత్ర ధ్వనిలో దాగి ఉన్న అనంత శక్తి
మన ఋషులు, యోగులు ఒకొక్క దేవతకు సంబంధించిన సంకేతం కనుగొన్నారు. వారు చెప్పిన పద్ధతిలో సాధన చేస్తే ఆ దేవతా స్వరూపాన్ని మనం అనుసంధానించుకోవచ్చును. సర్వత్రా వ్యాపించి ఉన్న దేవతా శక్తిని ఆ మంత్రాల ద్వారా మనం ఉత్తేజితం చేసుకుంటాం. ఎలాగంటే బయట కరెంటు స్థంబం మీద కరెంట్ వెళ్తుంటుంది, దాన్ని మనం ఒక వైర్ తగిలించుకుని మనం ఇంట్లో పవర్ తెచ్చుకున్నట్టు. ఆ శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ మంత్రధ్వని ద్వారా ఆ అనంతశక్తిని మనం కొంత మనలోకి తెచ్చుకున్నట్టు. బయటున్న కరెంటు స్థంబం కొంత ఎత్తులో వుంటుంది.

దానికి మన ఇంటినుండి తగిలించాలంటే ఆ వైర్ కి ఇంత అని నిర్దుష్టమైన పొడుగు ఉండాలి, ఆ వచ్చేది 5 యాంప్స్ 15 యాంప్స్ అన్నదాన్ని బట్టి ఆ వైర్ మందం వుంటుంది. అలాగే మనం ఏ కామ్యం కోసం చేస్తున్నామో ఆ కారణాన్ని బట్టి ఒకొక్క మంత్రం అన్ని సార్లు మననం చెయ్యాలని చెప్పబడి వుంది. ఒకే మంత్రం ఒక కామ్యానికైతే 15 వేలు జపం చెప్పబడి వుంటే కొన్నింటికి 64 వేలు ఇలా రకరకాలు గా వుంటుంది. ఆ శక్తి మండలం దగ్గర నుండి మనకు ఎంత శక్తి కావలసి వస్తుంది అంత మనకు గురువులు మంత్రజపం చెయ్యమని చెబుతారు. ఎలాగైతే ఒక ఎనర్జీ ఎక్స్పర్ట్ ఒక ఇంటికి ఎంత పవర్ కావాలని చెప్పగలడో, గురువులు మన కామ్యాన్ని బట్టి ఎంత శక్తి మనకవసరమో అన్ని వేల మంత్రజపం చెయ్యాలో చెబుతారు. నమ్మకంతో చేస్తే తప్పక ఫలితం వుంటుంది.

చింతలు దూరం చేసి, ఆధ్యాత్మిక శక్తిని పెంచే మంత్ర జపం
ఇక్కడ మరొక కోణం వుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ కేవలం మౌఖికంగానే కాదు, మౌనంగా కూడా వారి భావాల ద్వారా జరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపింపబడివుంది. వీటిని మనం నిత్యం అనుభవిస్తూనే వుంటాం. చూడండి కొంతమందిని కలవగానే ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరిని కలవగానే వారినుండి దూరం పోవాలని వుంటుంది. ఒకొక్కరి భావాలు మరొకరితో మాటల్లేకుండానే కలుస్తాయి, వికర్శితం అవుతాయి. ప్రతి ఒక్కరికీ కొంత ఆధ్యాత్మిక శక్తి వుంటుంది. మంత్ర జపం ద్వారా మన ఆధ్యాత్మిక శక్తి ని పెంచుకోవచ్చు. అది ఎవరితో వికర్శితమవుతోందో వాటిని సర్దవచ్చు. కేవలం మనలోనే కాదు, ఒక పరిస్థితికి ఎవరెవరితో సంబంధం వుందో దాన్ని ట్యూన్ చెయ్యగల సామర్ధ్యం మంత్ర జపానికి వుంది. మంత్రం కాయానికి ఉన్న “చింత” ను రాలుస్తుంది. నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పక ఫలితాన్ని పొందవచ్చు.

“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News