అంగరంగ వైభవంగా మేడారం(Medaram) శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ జాతర జరుగుతుంది. తెలంగాణలో జరుగుతున్న ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆ వన దేవతలను దర్శించుకుంటున్నారు. అయితే ఈ జాతరకు వచ్చిన భక్తులు కోళ్లను పైకి ఎగరవేస్తుంటారు. అసలు అలా ఎందుకు ఎగరవేస్తారో దాని వెనుక ఉన్న రహాస్యమేంటో తెలిస్తే షాక్ అవుతారు.
ఎదురుకోళ్లు సమర్పించటం వెనుక ఉన్న రహాస్యమిదే.!!
మేడారానికి వచ్చిన భక్తులు అమ్మవార్లకు బెల్లం, చీర, గాజులు, బియ్యం సమర్పిస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ అమ్మవార్లకు కోళ్లను ఎగరేస్తుంటారు. అమ్మవారికి కోళ్ళను ఎగరవేయడమనేది చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెబుతున్నారు.
కోళ్లు సమర్పించి మొక్కుబడులు
సాధారణంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. తమ కుటుంబం సంతోషంగా ఉండాలని మేకలు, గొర్రెలు, కోళ్లను సమర్పించుకుని మెుక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మరికొంత మంది అమ్మవారికి కోళ్లు బలివ్వ లేని వారు ఇలా ఎదురు కోళ్లు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటారని కోళ్ల విక్రయదారులు తెలుపుతున్నారు. ఇలా ఎగిరేసినందుకు కోడికి రూ.10 చొప్పున వసూలు చేస్తామని తెలుపుతున్నారు.
కోరికలు తీరుతాయని
గత జాతరలో ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరటంతో ఈ సంవత్సరం మేడారం వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఎదురు కోళ్లను సమర్పించినట్లు చెబుతున్నారు. ఈ అమ్మవారు ఎంతో మహిమ గల వారని ఎదురు కోళ్లను సమర్పిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.