Saturday, November 15, 2025
HomeదైవంArunachalam: కార్తీక పౌర్ణమికి అరుణాచలం వెళ్తున్నారా? అయితే ఈ విషయాలు మరచిపోకండి..

Arunachalam: కార్తీక పౌర్ణమికి అరుణాచలం వెళ్తున్నారా? అయితే ఈ విషయాలు మరచిపోకండి..

Arunachalam Giri Pradakshina 2025: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహిమాన్విత శైవ క్షేత్రం అరుణాచలం. సౌత్ ఇండియాలో వెలిసిన పంచభూత లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. దీనిని తమిళులు అన్నామలై లేదా తిరువణ్ణామలై అని, తెలుగు వారు అరుణాచలం అని పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని శివుడి ఆజ్ఞచే విశ్వకర్మ నిర్మించినట్లు స్కంధ పురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో వెలిశాడు. ఈ ఆలయానికి ఎంతటి విశిష్టత ఉందో.. ఇక్కడ చేసే గిరి ప్రదిక్షణకు కూడా అంతే ప్రాశస్త్యం ఉంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. పౌర్ణమి నాడు అక్కడ కొండ మీద జరిగే జ్యోతి ప్రజ్వలన క్రతువు నబూతో నభవిష్యత్తి అన్నట్టుగా ఉంటుంది. ఈ జ్యోతిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి లక్షల మంది వస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు చుట్టివచ్చినంతా పుణ్యం లభిస్తుంది.

- Advertisement -

గిరి ప్రదక్షిణ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..
అరుణాచల గిరి ప్రదక్షిణ మెుత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రదక్షిణ సమయంలో వచ్చే ఎనిమిది లింగాలను దర్శించుకోవడం వల్ల మహోన్నతమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగా ఇంద్ర లింగం ఆ తర్వాత వరుసగా అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం వంటివి దర్శించుకోవాలి.

Also Read: Gopashtami 2025 – గోపాష్టమి ఎప్పుడు? ఈ పండుగ ప్రత్యేకత ఏంటి?

గిరిప్రదక్షణ చెప్పులు లేకుండా నడవాలి. ప్రదక్షిణ సమయంలో ఎలాంటి కోరికలు కోరరాదు. దారిపొడవునా ఉండే బిక్షగాళ్లు లేదా సాదువులకు చిల్లర వేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సమయంలో తల పైన టోపీ లాంటివి ధరించకూడదు. ఈ క్రమంలో అన్నామలై దేవాలయం తప్పక సందర్శించాలి. విభూతిని ప్రసాదంగా స్వీకరించండి. దారిలో రమణ మహర్షి ఆశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమం తప్పక సందర్శించండి. ఓం అరుణాచల శివ అని నామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేయండి. ఈ ప్రదక్షిణ కేవలం ఎడమవైపున మాత్రమే చేయాలి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసి, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. తిరుపతి, విజయవాడ నుండి డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad