Mercury-Ketu Gochar 2025: కొన్ని గ్రహాలు నెలకొకసారి రాశులను మారుస్తాయి. ఈ క్రమంలో అవి ఇతర గ్రహాలతో కలిపి అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తాయి. తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కు కారకుడిగా బుధుడిని పరిగణిస్తారు. త్వరలో బుధుడు, కేతువు సింహరాశిలో కలవబోతున్నారు. వీరిద్దరి సంయోగం కొందరికి గోల్డెన్ డేస్ తీసుకురాబోతుంది. ఈ గ్రహాల సంగమం 18 ఏళ్ల తర్వాత సంభవించబోతుంది. వీటి ప్రభావం రాబోయే నెలలో ఏయే రాశులవారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం.
వృషభరాశి
బుధుడు-కేతువుల సంయోగం వృషభరాశి వారికి మంచి రోజులను తీసుకురాబోతుంది. వీరి ఆర్థిక పరిస్థితి మారుతుంది. భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పదోన్నతి అవకాశం ఉంది. కెరీర్ లో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది.
తులా రాశి
తులారాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆర్థికంగా మంచి పొజిషన్ కు చేరుకుంటారు. మీ వ్యాపార నష్టాలు తొలగిపోయి భారీగా లాభాలను గడిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఊహించిన లాభాలను ఇస్తాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్త వింటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనార్జన ఉంటుంది. భార్యభర్తలు రొమాంటిక్ సమయం గడుపుతారు. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. నెల రోజులపాటు తుల రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
Also Read: Durga Ashtami 2025 -ఈ ఏడాది దుర్గాష్టమి ఎప్పుడు? దీని ప్రత్యేకత ఏంటి?
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి బుధుడు సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అపాయ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మీ కెరీర్ కీలక మలుపు తిరుగుతుంది. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. భార్యభర్తల మధ్య కలహాలు తొలగిపోతాయి. సంతానప్రాప్తికి అవకాశం ఉంది.
Also read: Festivals in September 2025 -సెప్టెంబరులో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం సాధారణ నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి దృష్ట్యా పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


