Rahu-Moon conjunction 2025: సెప్టెంబరు నెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఈ మాసంలోని చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే రాహువు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కుంభరాశిలో రాహువు, చంద్రుడు కలయిక సెప్టెంబరు 6న ఉదయం 11: 21 గంటలకు జరగబోతుంది. వీరిద్దరి సంయోగం సెప్టెంబరు 8 మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ కాలంలో చంద్రుడు, రాహువు గ్రహణ యోగాన్ని సృష్టిస్తారు. ఈ యోగం అశుభకరంగా పరిగణించబడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారికి ఇబ్బందులు తప్పవు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మీన రాశి
గ్రహణ యోగం వల్ల మీనరాశి వారు కష్టాలపాలవుతారు. మీ సంసార జీవితంలో వివాదాలు వస్తాయి. కెరీర్ లో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. వ్యాపారులు నష్టపోతారు. లక్ కలిసిరాదు. లాభాలు అస్సలు ఉండవు. ఉద్యోగం కోసం మరి కొంత కాలం ఆగాలి.
తులా రాశి
కుంభరాశిలో రాహు-చంద్రుల కలయిక తులా రాశి వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. మీరు జాబ్ కోసం మరింత కాలం వేచిచూడాల్సి రావచ్చు. సమాజంలో మీ ప్రతిష్ఠ దిగజారుతుంది. మీకు అదృష్టం అస్సలు కలిసిరాదు. మీ కెరీర్ గాడితప్పుతుంది. మీ ఉద్యోగ జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు.
సింహరాశి
రాహు-చంద్రుల సంయోగం సింహరాశి వారికి అనేక సమస్యలను సృష్టిస్తుంది. కెరీర్ లో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. నలుగురిలో మీ గౌరవానికి భంగం కలుగుతుంది. లక్ అస్సలు కలిసిరాదు. బిజినెస్ లో భారీగా నష్టాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. పిల్లల కోసం మరింత కాలం వేచిచూడాల్సి రావచ్చు.
Also Read: Naraka chaturdashi 2025-ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు? యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనిని పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఇచ్చాం. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.


