Shashi-Aditya Rajyoga 2025: గ్రహాలు కాలానుగుణంగా తన రాశిచక్రాలను మార్చి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గత నెల చివర్లో చంద్రుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే సూర్యుడు, గురుడు అదే రాశిలో సంచరిస్తున్నాయి. చంద్రుడు, సూర్యుడు కలయిక కారణంగా అరుదైన శశి ఆదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ శశి ఆదిత్య రాజయోగం కొందరి అదృష్టం ప్రకాశించనుంది. వీరికి డబ్బుకు, ధాన్యానికి లోటు ఉండదు. కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాజయోగం వల్ల లాభపడనున్న రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
ఇదే రాశిలో శశి ఆదిత్య రాజ్యయోగం రూపొందనుంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆస్తులు కొనడానికి ఇదే మంచి సమయం. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు. మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. కెరీర్ లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి.. మంచి స్థాయికి వెళతారు. అప్పుల భారం నుండి బయటపడతారు. సంతానసుఖం కలుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. విలువైన ఆస్తులు, బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
మిథునరాశిలోకి సూర్యుడు-చంద్రుడు సంయోగం ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. లైఫ్ పార్టనర్ తో రొమాంటిక్ సమయం గడుపుతారు. క్రియేటివిటీతో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారు. కొత్తగా వ్యాపారం మెుదలుపెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనధాన్యాలకు కొదవ ఉండదు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బైక్ లేదా కారు కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ధన యోగం ఉంది.
కన్య రాశి
శశి-ఆదిత్య రాజయోగం కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. జాబ్ కొట్టాలనే కోరిక నెరవేరుతోంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న జాబ్ రానే వస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో మీ సీనియర్ అధికారి ప్రశంసలు లభిస్తాయి. మీడియా, మార్కెటింగ్, ఐటీ రంగాలలో పనిచేసేవారు లాభాలను పొందతారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. బిజినెస్ పార్టనర్స్ మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి. పేదరికం నుంచి విముక్తి చెందుతారు.
Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, సాధారణ నమ్మకాలు, సనాతన సంప్రదాయాలు ఆధారంగా తీసుకోబడింది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.