Shukra Mangal Gochar 2025: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశిచక్రాలను మారుస్తాయి. ఇటీవల శుక్రుడు తులారాశి ప్రవేశం చేశాడు. అంతేకాకుండా మాలవ్య రాజయోగాన్ని కూడా సృష్టించాడు. త్వరలో శుక్రుడు అంగారకుడితో కలవబోతున్నారు. వీరిద్దరి కలయిక నవంబర్ 10న జరగబోతుంది. ఈ సమయంలో రెండు గ్రహాలు కలిసి ద్విద్వాదశ రాజయోగం రూపొందుతోంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
ధనస్సు రాశి
శుక్ర అంగారక యోగం ధనస్సు రాశి వారికి లాభిస్తుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు ఊహించని బెనిఫిట్స్ ను పొందుతారు. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన ధనం మీ చెంతకు చేరుతుంది. కెరీర్ లో సక్సెస్ ఉంటుంది. మీ చింతలన్నీ తీరిపోతాయి. కోరీకలన్నీ నెరవేరుతాయి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఇదే రాశిలో కుజుడు సంచరించడం వల్ల అరుదైన రుచక రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ద్విద్వాశ రాజయోగం వల్ల మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. భారీగా డబ్బును పొందుతారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి టైం. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ ప్రమోషన్ రానే వస్తుంది.
Also Read: Mercury Transit 2025 – బుధుడి అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్న రాశులివే.. మీది ఉందా?
మేష రాశి
శుక్రుడు కుజుల కలయిక మేషరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. మీ సంపద రెట్టింపు అవుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విద్య లేదా ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరగడంతోపాటు ప్రమోషన్ కు కూడా అవకాశం ఉంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయాన్ని గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.


