Ekadashi in October 2025: శ్రీమహావిష్ణువును పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు ఏకాదశి. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. అవి శుక్లపక్ష మరియు కృష్ణపక్ష ఏకాదశులు. ఈరోజున భక్తులు ఉపవాసాన్ని పాటిస్తూ శ్రీహరిని పూజిస్తారు. అక్టోబరు నెలలో అత్యంత శుభప్రదమైన పాపాంకుశ ఏకాదశి, రామ ఏకాదశి రాబోతున్నాయి. ఆ ఏకాదశులు తేదీలు, శుభముహూర్తం, పూజా విధానం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
పాపాంకుశ ఏకాదశి తేదీ, శుభ సమయం
అశ్వినీ మాసం శుక్ల పక్ష ఏకాదశినే పాపాంకుశ ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి అక్టోబర్ 02, 2025న రాత్రి 07:10 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 03, 2025న సాయంత్రం 06:32 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, పాపాంకుశ ఏకాదశిని అక్టోబరు 3న జరుపుకోనున్నారు. అక్టోబరు 4న ఉదయం 06:16 గంటల నుండి ఉదయం 08:37 AM వరకు పారణ సమయం ఉంటుంది. ద్వాదశి అదే రోజు సాయంత్రం 05:09 గంటలకు ముగుస్తుంది.
రామ ఏకాదశి తేదీ, శుభ సమయం
కార్తీక మాసం కృష్ణ పక్ష ఏకాదశినే రామ ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి అక్టోబర్ 16, 2025 ఉదయం 10:35 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 17, ఉదయం 11:12 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, రామ ఏకాదశిని అక్టోబరు 17న జరుపుకోనున్నారు. పారణ సమయం అక్టోబర్ 18 ఉదయం 06:24 గంటల నుండి ఉదయం 08:41 గంటల వరకు ఉంటుంది. అదో రోజు ద్వాదశి ముగింపు ముహూర్తం మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది.
ఏకాదశి ప్రాముఖ్యత
హిందువులు ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఇది ఎంతో ముఖ్యమైన రోజు. విశ్వాన్ని రక్షించే శ్రీమహావిష్ణువును ఏకాదశి రోజున పూజించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. అంతేకాకుండా అన్ని పాపాల నుండి విముక్తి పొందడంతోపాటు ఆనందం, శ్రేయస్సును పొందుతారు. ఈ ఏకాదశి వ్రతాన్నిపాటించడం వల్ల మరణానంతరం నేరుగా శ్రీహరి నివాసమైన వైకుంఠ ధామానికి చేరుకుంటారని నమ్మకం.
పూజా విధానం
ఏకాదశి పర్విదినాన ఉదయం నిద్రలేచి తలస్నానమాచరించండి. ఉపవాస దీక్షను తీసుకుని పూజా గదిని శుభ్రం చేయండి. అనంతరం చెక్క పీఠంపై విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టండి. తులసితోపాటు పంచామృతాన్ని సమర్పించి.. విగ్రహం ముందు నెయ్యితో ఆఖండ దీపాన్ని వెలిగించండి. దేవుడికి మాలధారణ చేసి..పూలు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయడంతోపాటు ఓం నమో భ్జగ్వతే వాసుదేవయే.., అచ్యుతం కేశ్వం కృష్ణ దామోదరం రామ్ నారాయణం జానకీ వల్లభం..అనే మంత్రాలను జపించండి. మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున ఉదయం పారణ సమయంలో ఉపవాసం విరమించవచ్చు.


