Thursday, September 19, 2024
HomeదైవంEurope: యూరోప్ లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు

Europe: యూరోప్ లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు

వివిధ దేశాలలోని పలు నగరాల్లో అత్యంత వైభవంగా కల్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరోప్, యూకేలలోని పలు నగరాల్లో సెప్టెంబర్ ౩౦ వ తేదీ నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కల్యాణోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న Frankfurt, అక్టోబర్ 01న Utrecht-Netherlands లో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ ఎక్కడా, ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. అక్కడి నిర్వాహకులు… భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Frankfurt లో స్వామివారి కల్యాణ వేదికను ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. Utrecht-Netherlands లో శ్రీవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్యలో స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని తిలకించి, భక్తిపరవశంతో పులకించారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు.

ఈ నేపథ్యంలో APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వయ సూచనలతో యూరోప్ మరియు యూకే లోని వివిధ తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు తితిదే వారి అనుమతితో ఈ కల్యాణోత్సవాలు జరుగుతున్నాయన్నారు.

మరో నాలుగు నగరాల్లో ఈ నెల 07 వ తేదీ నుండి 15 వరకు శ్రీ వేంకటేశ్వర కల్యాణాలు నిర్వహిస్తున్నట్లు వెంకట్ తెలిపారు. యూరోప్ లోని ఈ 02 నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో Stichting Vasudhaiva Kutumbakam (SVK) ముఖ్యపాత్ర పోషించింది. శివరామ్ తడిగొట్ల, APNRTS రీజనల్ కో ఆర్డినేటర్ కార్తీక్ యార్లగడ్డ పర్యవేక్షణలో జి. వెంకట కృష్ణా, సూర్య ప్రకాష్ తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో తితిదే నుండి Dy.EE వి.జె. నాగరాజ, ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. SVBC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని వెబ్ లైవ్ కవరేజ్ ను సమన్వయము చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News