Wednesday, March 26, 2025
HomeతెలంగాణSuman: తిరుమల వెంకన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు సుమన్

Suman: తిరుమల వెంకన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు సుమన్

తిరుమల వెంకన్న స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్(Suman) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో సుమన్ తన మిత్ర బృందంతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం ఇచ్చారు.

అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయం, సినిమా, ప్రజలు క్షేమంగా ఉండాలని విద్యార్థులు బాగా చదువుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

తాను ఊహించుకున్న దానికన్నా దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడని చెప్పారు ఇందుకు తన తల్లిదండ్రులు చేసిన పుణ్యమే కారణమన్నారు. హిందీ, తెలుగులో విడుదల కానున్న కాంత అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. ధర్మస్థల నియోజకవర్గం అనే సినిమాలో మరో పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. కన్నడ, మలయాళం సినిమాల్లో అనేక ప్రధాన పాత్రలు పోషిస్తున్నానన్నారు. ఇతర భాషల్లోని సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నానన్నారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, శ్రీ సత్యనారాణాయణ స్వామి వ్రతం వంటి సినిమాలు నటించి దైవిక పాత్రలు పోషించినట్లు ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News