February planetary transits:జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం అనేది వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక ఆర్థిక పరిణామాలపై ప్రభావం చూపే అంశంగా భావిస్తారు. నవగ్రహాలు నిర్దిష్ట కాల వ్యవధుల్లో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ మార్పులు ప్రతి వ్యక్తి జీవన ప్రయాణంలో కొత్త దశలను తీసుకొస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో జరగబోయే గ్రహాల కదలికలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నాలుగు ప్రధాన గ్రహాలు..
2026 ఫిబ్రవరిలో నాలుగు ప్రధాన గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి ఈ సంచారం ప్రారంభం కానుంది. ముందుగా బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 6న శుక్రుడు, 13న సూర్యుడు, 23న కుజుడు కూడా అదే రాశిలో సంచారం చేయనున్నారు. ఈ పరిణామంతో కుంభ రాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు కలిసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని జ్యోతిష్యశాస్త్రంలో చతుర్గ్రాహి యోగంగా పేర్కొంటారు.
చతుర్గ్రాహి యోగంతో…
ఈ చతుర్గ్రాహి యోగంతో పాటు అదే సమయంలో లక్ష్మీ నారాయణ యోగం, శుక్రాదిత్య యోగం, ఆదిత్య మంగళ యోగం, బుధాదిత్య యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ యోగాలన్నీ సాధారణంగా ఆర్థిక స్థిరత్వం కెరీర్ పురోగతి కుటుంబ సంతోషం వంటి అంశాలకు అనుకూలంగా పరిగణించబడతాయి. అందువల్ల ఫిబ్రవరి నెలను అనేక రాశుల వారికి శుభకాలంగా జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ గ్రహాల సంచారం ప్రభావం అన్ని రాశులపై ఒకే విధంగా ఉండదు. అయితే కొన్ని రాశులకు మాత్రం ఈ కాలం ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ముఖ్యంగా మేష మిథున కన్య కుంభ రాశులకు ఈ యోగాల ప్రభావం స్పష్టంగా కనిపించనుందని అంచనా.
మేష రాశి…
మేష రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏర్పడే రాజయోగాల కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఎదురైన ఆర్థిక ఒత్తిడులు తగ్గి ఆదాయం పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపించే అవకాశం ఉండటంతో పాటు వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలపై సమాచారం అందే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో ముందడుగు వేస్తారు. కార్యాలయంలో పని చేస్తున్న వారికి పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరగవచ్చు.
మిథున రాశి..
మిథున రాశి వారికి కూడా ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం వల్ల అనేక అనుకూల మార్పులు కనిపించనున్నాయి. ఆదాయం స్థిరంగా పెరగడంతో పాటు కొత్త అవకాశాలు కూడా దక్కే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధిత శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో జాగ్రత్తతో అడుగులు వేస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు.
కన్య రాశి ..
కన్య రాశి వారికి ఫిబ్రవరి నెల గ్రహాల సంచారం వల్ల వృత్తి పరంగా మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూలత పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు లేదా చట్టపరమైన వ్యవహారాల్లో అనుకూల తీర్పులు రావచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కార్యాలయంలో మంచి వాతావరణం ఏర్పడి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది.
ఆకస్మిక ఆర్థిక లాభం రావడం వల్ల కుటుంబ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి సంతోషంగా గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. కెరీర్ పరంగా ముందడుగు వేయడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రాధాన్యం కలిగి ఉంది. నాలుగు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయడం వల్ల కుంభ రాశి వారికి అనేక శుభయోగాలు కలుగనున్నాయి. గ్రహాల అనుగ్రహంతో కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన పనులు పూర్తవుతాయి.
ఆర్థిక పరిస్థితి బలపడటంతో పాటు అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు లేదా ప్రయాణాలు ప్లాన్ చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

