Female Foot Palmistry in Telugu: సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తుల భవిష్యత్తును ఇట్టే అంచనా వేయవచ్చు. మనిషి శరీరంలో ఉండే ఒక్కో అంగాన్ని బట్టి వారి ప్యూచర్ ఎలా ఉంటుందో జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ముందే ఊహించి చెబుతారు. మనిషి ముఖం, శరీరం, చేతులు, కాళ్లు, ఆకారం ఆధారంగా ఆ వ్యక్తి యెుక్క ప్యూచర్ ను ప్రిడిక్ట్ చేస్తారు.
సాధారణంగా స్త్రీలను లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తాం. ఆడపిల్ల ఇంటికే అందమని చాలా మంది అంటుంటారు. అమ్మాయిలు ఉన్న ఇంట్లో దేనికీ కోరత ఉండదని..వారు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. అటువంటి స్త్రీ పెళ్లి తర్వాత వివాహితగా మారుతుంది. కానీ సాముద్రిక శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రాల్లో స్త్రీ పాదాల నిర్మాణం మరియు ఆకారాన్ని బట్టి వారి భవిష్యత్తును అంచనా వేయవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మృదువైన, ఏకరీతి పాదాలతో ఉన్న స్త్రీలు:
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, మృదువైన, ఏకరీతి పాదాలతో ఉన్న స్త్రీలు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. వీరికి సంగీతం, కళలు లేదా సృజనాత్మక కలిగిన రంగాలపై ఆసక్తి ఉంటుంది. వీరు ఎక్కువగా సంతోషకరమైన జీవితాన్ని గడపటానికే ఇష్టపడతారు.
మృదువైన, జత చేసిన పాదాల వేళ్లు:
స్త్రీల మృదువైన, జత చేసిన వేళ్లు శుభ ఫలితాలను ఇస్తాయని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది. వీరు ఎదుటవారిని లోతుగా అర్థం చేసుకుని వారికి సపోర్టు ఇస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తగ్గకుండా చూస్తారు. పెళ్లి తర్వాత సంతోషంగా జీవిస్తారు. ఈ స్త్రీ ఏ అత్తవారింటికి వెళుతుందో వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే వారికి ధనధాన్యాలకు లోటు ఉండదు.
స్త్రీల పాదాలపై శంఖం, కమలం, జెండా లేదా చేప:
స్త్రీల పాదాలపై శంఖం, కమలం, జెండా లేదా చేప ఆకారాలు ఉంటే వారు ధనవంతులైన పురుషులను పెళ్లి చేసుకుంటారు. వీరి రాకతో అత్తవారింట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరు ఏ లోటు లేకుండా జీవిస్తారు. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది.


