Sunday, February 8, 2026
HomeదైవంFestivals in February 2026: ఫిబ్రవరి నెల పండుగల లిస్ట్ ఇదే!

Festivals in February 2026: ఫిబ్రవరి నెల పండుగల లిస్ట్ ఇదే!

Festivals in February 2026: 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల. ఈ నెలలో హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహా శివరాత్రి తో పాటు చైతన్యాన్ని నింపే ఛత్రపతి శివాజీ జయంతి వంటి విశేష దినాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో రాబోయే ప్రధాన పండుగలు, వ్రతాలు గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఫిబ్రవరి పండుగల లిస్ట్
మాఘ పూర్ణిమ, గురు రవిదాస్ జయంతి- ఫిబ్రవరి 1,ఆదివారం
ఫాల్గుణ మాసం ప్రారంభం(ఉత్తర భారతదేశం)-ఫిబ్రవరి 2, సోమవారం
ద్విజప్రియ సంకష్టి- ఫిబ్రవరి 5, గురువారం
యశోద జయంతి- ఫిబ్రవరి 7,శనివారం
భాను సప్తమి, శబరి జయంతి- ఫిబ్రవరి 8,ఆదివారం
జానకి జయంతి (సీతాష్టమి), కాలాష్టమి, జన్మాష్టమి- ఫిబ్రవరి 9,సోమవారం
కృష్ణ భీష్మ ద్వాదశి, విజయ ఏకాదశి- ఫిబ్రవరి 13, శుక్రవారం
శని త్రయోదశి, వాలెంటైన్స్ డే- ఫిబ్రవరి 14,శనివారం
మహా శివరాత్రి- ఫిబ్రవరి 15,ఆదివారం
సూర్య గ్రహణం, ఫాల్గుణ అమావాస్య- ఫిబ్రవరి 17,మంగళవారం
పులకల దూజ్, శివాజీ జయంతి- ఫిబ్రవరి 19,గురువారం
స్కంధ షష్టి- ఫిబ్రవరి 22, ఆదివారం
నెలవారీ దుర్గాష్టమి- ఫిబ్రవరి 24, మగంళవారం
ఆమలకీ ఏకాదశి- ఫిబ్రవరి 27,శుక్రవారం
నరసింహ ద్వాదశి- ఫిబ్రవరి 28, శనివారం

Also Read: Vasant Panchami 2026 : ఈ చిన్న పని చేస్తే చదువులో తిరుగుండదు

ముఖ్యమైన పండుగలు
మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 1): పవిత్ర నదీ స్నానాలకు మాఘ పూర్ణిమ ఎంతో శ్రేష్ఠమైనది.
ఏకాదశి వ్రతాలు: విజయ ఏకాదశి (ఫిబ్రవరి 13), ఆమలకీ ఏకాదశి (ఫిబ్రవరి 27)
ప్రదోష వ్రతం: ఫిబ్రవరి 14న శని ప్రదోష వ్రతం వస్తుంది. శని దోష నివారణకు ఇది చాలా మంచి రోజు.
మహా శివరాత్రి (ఫిబ్రవరి 15, ఆదివారం): ఈ నెలలో అత్యంత పెద్ద పండుగ. శివయ్యను ఆరాధిస్తూ భక్తులు జాగరణ చేసే ఈ పర్వదినం ఆదివారం రావడం విశేషం.
అమావాస్య (ఫిబ్రవరి 17): ఫాల్గుణ అమావాస్యతో పాటు ఈ రోజున సూర్య గ్రహణం (వలయాకార) ఏర్పడనుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News