July 2025 Hindu Festival Calendar: ఆధ్యాత్మికతంగా జూలై నెల ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మాసంలో ఆషాడ మాసం ముగిసి శివుడికి ఇష్టమన శ్రావణ మాసం మెుదలుకానుంది. అంతేకాకుండా శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రలో ఉండే చాతుర్మాసం కూడా ఇదే నెలలో ఆరంభం కానుంది. దీనినే దేవశయని ఏకాదశిని లేదా ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి అని పిలుస్తారు. పవిత్ర జగన్నాథ రథయాత్ర తర్వాత ఈ ఏకాదశి వస్తుంది. శ్రావణ మాసంలో తొలి సోమవారం జూలై 14న రాబోతోంది. పవిత్రమైన శ్రావణ శివరాత్రి జూలై 23న, హరియాలీ తీజ్ జూలై 27న జరుపుకోనున్నారు.
జూలైలో వ్రతాలు మరియు పండుగలు:
జూలై 6 – దేవశయని ఏకాదశి, గౌరీ వ్రతం
జూలై 8 – భౌమ్ ప్రదోష వ్రతం
జూలై 9 – ఆషాఢ చోమసి చౌదాస్
జూలై 10- కోకిల వ్రతం, గురు పూర్ణిమ
జూలై 11- శ్రావణ మాసం ప్రారంభం
జూలై 14 – శ్రావణ మొదటి సోమవారం
జూలై 15 – మంగళ గౌరీ వ్రతం
జూలై 16 – కర్క సంక్రాంతి
జూలై 21- శ్రావణ మాసం రెండవ సోమవారం
జూలై 22 – రెండవ మంగళ గౌరీ వ్రతం, శ్రావణ ప్రదోష వ్రతం
జూలై 23 – శ్రావణ శివరాత్రి
జూలై 24 – హరియాళీ అమావాస్య
జూలై 27 – హరియాలీ తీజ్
జూలై 28 – శ్రావణ మాసం మూడవ సోమవారం, వినాయక చతుర్థి
జూలై 29 – నాగ పంచమి
జూలై 30 – స్కంద షష్టి
జూలై 31- తులసీదాస్ జయంతి
ఇదిలా ఉంటే, జూలై నెలలో కొన్ని గ్రహాల స్థానాల్లో కీలకమార్పులు రాబోతున్నాయి. జూలై 09న దేవగురు బృహస్పతి మిథునరాశిలో ఉదయించబోతున్నాడు. అదే నెల 16న సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అంటారు. జూలై 26న శుక్ర గ్రహం మిథునరాశిలోకి, 28న అంగారకుడు కన్యారాశిలోకి ఎంటర్ అవ్వనున్నారు. అంతేకాకాకుండా గ్రహాల యువరాజైన బుధుడు జూలై 18న కర్కాటక రాశిలో వక్రీకరణం చెంది..అదే రాశిలో 24న అస్తమించబోతున్నాడు.