Festivals in Karthika Masam 2025: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకానుంది. ఈ నెలలో భక్తులు శివుడితోపాటు విష్ణువును కూడా పూజిస్తారు. తెల్లవారుజామునే లేచి దగ్గరలో ఉన్న నది జలాల్లో స్నానమాచరించి దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీకం ఎనిమిదో నెలగా భావిస్తారు. పూజలకు, ధ్యానానికి మరియు దాతృత్వానికి ఇది ఎంతో అనువైన సమయంగా భావిస్తారు. ఈ మాసం మీలో ఆధ్యాత్మిక వృద్ధిని మేల్కొలుపుతోంది.
పంచాంగం ప్రకారం, కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబరు 8, 2025న ప్రారంభమైన.. నవంబర్ 5, 2025న ముగుస్తుంది. అయితే ఇస్కాన్ ను అనుసరించేవారు మాత్రం కార్తీక మాసం అక్టోబర్ 7న మెుదలై.. నవంబర్ 6న ముగస్తుందని అంటున్నారు. ఈ శుభకరమైన నెలలోనే కర్వా చౌత్, అహోయ్ అష్టమి, ధంతేరాస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్థన పూజ, భాయ్ దూజ్ వంటి ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయి. ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాలు, ఉపవాసాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read: Karva Chauth-కర్వా చౌత్ రోజు భర్త ముఖాన్ని జల్లెడలో ఎందుకు చూస్తారు.. కారణమిదే.!
కార్తీకంలో రాబోయే పండుగలు, వ్రతాలు లిస్ట్:
అక్టోబర్ 10, 2025, శుక్రవారం- కర్వా చౌత్, సంకష్టి చతుర్థి
11 అక్టోబర్ 2025, శనివారం- రోహిణి వ్రతం
13 అక్టోబర్ 2025, సోమవారం- కాలాష్టమి, అహోయి అష్టమి, రాధా కుండ్ స్నానం, మాసిక్ కృష్ణ జన్మాష్టమి
17 అక్టోబర్ 2025, శుక్రవారం- తులా సంక్రాంతి, గోవత్స ద్వాదశి, రామ ఏకాదశి
18 అక్టోబర్ 2025, శనివారం- శని త్రయోదశి, ధంతేరాస్, యమ దీపం
19 అక్టోబర్ 2025, ఆదివారం- మాసిక్ శివరాత్రి, కాళీ చౌదాస్, హనుమాన్ జయంతి
20 అక్టోబర్ 2025, సోమవారం- నరక చతుర్దశి, చోటి దీపావళి
21 అక్టోబర్ 2025, మంగళవారం- దీపావళి, భౌమవతి అమావాస్య, కార్తీక అమావాస్య
22 అక్టోబర్ 2025, బుధవారం-అన్న కూట్, గోవర్ధన్ పూజ, బలి ప్రతిపద, గుజరాతీ నూతన సంవత్సరం
23 అక్టోబర్ 2025, గురువారం- భాయ్ దూజ్, యమ ద్వితీయ, చిత్రగుప్త పూజ
25 అక్టోబర్ 2025, శనివారం- మాసిక వినాయక చతుర్థి వ్రతం
26 అక్టోబర్ 2025, ఆదివారం- లాభ పంచమి
27 అక్టోబర్ 2025, సోమవారం- స్కంద షష్ఠి, ఛత్ పూజ ప్రారంభమవుతుంది
29 అక్టోబర్ 2025, బుధవారం- బుధ అష్టమి వ్రతం
30 అక్టోబర్ 2025, గురువారం- గోపాష్టమి, మాసిక్ దుర్గా అష్టమి
31 అక్టోబర్ 2025, శుక్రవారం- అక్షయ నవమి, జగద్ధాత్రి పూజ
01 నవంబర్ 2025, శనివారం- ప్రబోధిని (దేవ్ ఉత్థాని) ఏకాదశి, కంస వధ, భీష్మ పంచకం ప్రారంభం
02 నవంబర్ 2025, ఆదివారం- తులసీ వివాహం, వైష్ణవ దేవుత్థాన ఏకాదశి, యోగేశ్వర ద్వాదశి
03 నవంబర్ 2025, సోమవారం- విశ్వేశ్వర వ్రతం, సోమ ప్రదోష వ్రతం, వైకుంఠ చతుర్దశి
04 నవంబర్ 2025, మంగళవారం- మణికర్ణిక స్నానం
05 నవంబర్ 2025, బుధవారం- దేవ్ దీపావళి, భీష్మ పంచకం ముగింపు, గురునానక్ జయంతి, పుష్కర స్నానం, కార్తీక పూర్ణిమ


