Saturday, November 15, 2025
HomeదైవంFive rare Rajayogas: ఒకే రోజు 5 అద్భుత రాజయోగాలు..దీపావళికి ఈ రాశుల వారికి దశ...

Five rare Rajayogas: ఒకే రోజు 5 అద్భుత రాజయోగాలు..దీపావళికి ఈ రాశుల వారికి దశ తిరగబోతుంది!

Diwali 2025- Rajayogas 2025 :సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈసారి దీపావళి చాలా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన ఈ పండుగ రోజున 800 సంవత్సరాల తర్వాత ఐదు అరుదైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడబోతున్నట్లు పండితులు వివరిస్తున్నారు. వీటిని సుక్రాదిత్య యోగం, హంస మహాపురుష యోగం, నీచ్‌బంగ్ రాజయోగం, నవపంచ రాజయోగంతో పాటు కాలకృతి రాజయోగం అని పిలుస్తారు.

- Advertisement -

ఈ ఐదు యోగాలు కొన్ని రాశుల వారికి జీవితంలో అద్భుత శుభఫలితాలను, సౌభాగ్యాన్ని, ఆర్థిక ప్రగతిని, మానసిక సంతోషాన్ని అందిస్తాయని నిపుణుల వెల్లడిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/rare-hamsa-mahapurusha-yoga-forming-this-diwali-after-100-years/

దీపావళి సమయంలో ఈ గ్రహ స్థితి మార్పులు జ్యోతిష్యంగా అత్యంత శుభప్రదమైనవిగా చెబుతున్నారు. ఈరోజు సంభవించే యోగాలు కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తాయని జ్యోతిష్య విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మిథున, కర్కాటక, తులా, మకర రాశుల వారికి ఈ రోజు అదృష్టాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు.

మిథున రాశి

మిథున రాశి జాతకుల జీవితాల్లో దీపావళి రోజు సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. జాతకంలోని రెండవ ఇంట్లో ఏర్పడే హంస రాజయోగం వైవాహిక జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది మరియు జీవిత భాగస్వామితో మధురమైన బంధం ఏర్పడుతుంది. ఐదవ ఇంట్లో ఏర్పడే సుక్రాదిత్య యోగం వృత్తి రంగంలో విజయం అందిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది.

నాలుగవ ఇంట్లో ఉండే కాలకృతి యోగం మానసిక సంతృప్తి, ప్రశాంతత, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈ కాలం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రుణ సమస్యలు తగ్గుతాయి, కుటుంబ అవసరాలు తీరతాయి. కెరీర్‌లో ముందడుగు వేయడమే కాకుండా స్నేహితుల సహకారం వలన కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశాలు కనపడుతున్నట్లు పండితులు వివరిస్తున్నారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకంలో దీపావళి రోజున లగ్న ఇంట్లో సంభవించే ఈ యోగాలు జీవితంలో గణనీయమైన మార్పును తెస్తాయి. రెండవ ఇంట్లో ఏర్పడే కాలకృతి యోగం ఆర్థిక స్థిరత్వాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తుంది. వృత్తి జీవితంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ అభిప్రాయాలకు, నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. పాత పెట్టుబడుల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.

నవపంచ రాజయోగం వల్ల దాంపత్య జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది. గత కాలంలో ఎదురైన ఒత్తిడి తగ్గిపోతుంది. కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంది. వృత్తిలో ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది.

తులా రాశి

తులా రాశి జాతకంలో దీపావళి రోజున కర్మభావనలో హంస రాజయోగం, లగ్నభావనలో సుక్రాదిత్య యోగం ఏర్పడుతున్నాయి. ఈ గ్రహ స్థితి పనిలో పురోగతిని, గౌరవాన్ని తెస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి వార్త వినే అవకాశం ఉంది.

సీనియర్ అధికారుల ఆదరణ పొందడం ద్వారా ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. రుణ సమస్యలు తగ్గిపోవడం వలన ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పాత పెట్టుబడుల నుండి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లోహ సంబంధిత పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు, పెద్ద లావాదేవీలు జరిగే అవకాశముంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/five-zodiac-signs-to-get-royal-luck-after-october-16/

మకర రాశి

మకర రాశి వారికి దీపావళి రోజు ప్రత్యేక ఫలితాలు దక్కనున్నాయి. తొమ్మిదవ ఇంట్లో ఏర్పడే గ్రహ స్థితి వారిలో ఉన్న వ్యక్తిగత కోరికలు నెరవేర్చేలా మారుతుంది. కాలకృతి యోగం మరియు కర్మ యోగం మకర రాశి జాతకుల ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి. తల్లిదండ్రుల అనుమతితో స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు లభిస్తాయి.

దీర్ఘకాలంగా ప్లాన్ చేస్తున్న ప్రాజెక్టులు లేదా ప్రయాణాలు సాకారమవుతాయి. వివాహితులైన వారికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు తలుపుతడతాయి.

దీపావళి రోజున ఏర్పడే ఈ ఐదు యోగాలు సామాన్యంగా అన్ని రాశులపైనా శుభప్రభావాన్ని చూపుతాయి. కాని పై పేర్కొన్న రాశుల వారికి ప్రత్యేక శుభఫలితాలు ఇవ్వనున్నాయి. ఈ యోగాలు జీవనంలో సానుకూల మార్పు, ఆర్థిక స్థిరత్వం, ఆనందం మరియు విజయాన్ని తెస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad