Sunday, November 16, 2025
HomeదైవంAstrology October: ఈ రాశుల వారికి అనుకోని లాభాలు..నవంబర్‌ వరకు పట్టిందల్లా బంగారమే!

Astrology October: ఈ రాశుల వారికి అనుకోని లాభాలు..నవంబర్‌ వరకు పట్టిందల్లా బంగారమే!

Planetary Transit:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ప్రతి రాశి వారి జీవితంలోనూ విశేషమైన మార్పులను తీసుకువస్తాయి. గ్రహాలు తమ స్థానం మార్చినప్పుడు, కొన్ని రాశులపై అనుకూల ప్రభావం చూపుతాయి.మరికొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అక్టోబర్ 16 తర్వాత జరిగే గ్రహ సంచారం కూడా ఇలాగే కొన్ని రాశులకు అదృష్టం తెస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయని, ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ కాలం ఎంతో శుభప్రదమని భావిస్తున్నారు.

- Advertisement -

ఈ ఐదు రాశులలో ఉన్న వారికి కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబం, సామాజిక గౌరవం వంటి అంశాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొందరికి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ కాలంలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గ్రహాల కదలికలు మన జీవితంలో ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం..

Also Read: https://teluguprabha.net/devotional-news/chanakya-explains-signs-of-fake-friendship-and-true-friends/

మేష రాశి:

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 వరకు మేష రాశి వారికి శుభ సమయం మొదలవుతుందని పండితులు వివరిస్తున్నారు. ఈ కాలంలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, రాహువు వంటి గ్రహాలు ఈ రాశికి అనుకూల స్థితిలో ఉంటాయి. వీటి ప్రభావంతో మేష రాశి వారు ఆర్థికంగా ఎదుగుదల సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి.

వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుని లాభాలు పొందవచ్చు. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఈ కాలం మొత్తం వీరి జీవితంలో ఉత్సాహాన్ని నింపుతుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ మధ్యకాలంలో బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని వంటి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. దీని ఫలితంగా ఆర్థిక స్థిరత్వం దక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు పైస్థాయికి ఎదగడం లేదా కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కొత్త పెట్టుబడులు లాభాలను తీసుకుని వచ్చే సూచనలున్నాయి. కుటుంబంలో పెద్దల అనుకూలత లభిస్తుంది. కొత్త ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం ప్రారంభం కావచ్చు. ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా దక్కుతుంది.

సింహ రాశి:

సింహ రాశి వారికి గురుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు, రాహువు వంటి గ్రహాల కదలికలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. గత కొంతకాలంగా ఎదురైన ఒత్తిడులు, సమస్యలు ఈ కాలంలో తగ్గుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొందరికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది.

వ్యాపారంలో లాభాలు సాధారణ స్థాయిని మించి వస్తాయి. కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలు లేదా వివాదాల వంటి సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా అనుకున్న లక్ష్యాలు సాకారం అయ్యే సమయం ఇది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి అక్టోబర్ 16 తర్వాత అనుకోని ఆర్థిక లాభాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఆర్థికంగా మంచి పరిస్థితులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది.

కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టినవారికి లాభదాయక ఫలితాలు దక్కుతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు రావచ్చు. ఈ రాశివారికి ఇది పురోగతి దిశగా ముందడుగు వేయించే సమయం.

తుల రాశి:

తుల రాశి వారికి అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ చివరి వరకు అదృష్టం బలంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో శుక్రుడు, గురుడు, బుధుడు వంటి గ్రహాలు అనుకూల ప్రభావం చూపుతాయి. ఉద్యోగస్థులు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయక దిశగా పయనిస్తాయి.

Also Read: https://teluguprabha.net/devotional-news/aquarius-zodiac-to-see-career-and-wealth-growth-after-diwali/

పెట్టుబడులపై మంచి రాబడి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. అనుకోని చోట్ల నుంచి డబ్బు వస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కాలం మొత్తం వీరి కోసం విజయవంతమైన దశగా నిలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad