Friday, December 12, 2025
HomeదైవంNavaratri 2025: నవరాత్రులకు ముందు ధనవంతులు కాబోయే రాశులు ఏవో తెలుసా?

Navaratri 2025: నవరాత్రులకు ముందు ధనవంతులు కాబోయే రాశులు ఏవో తెలుసా?

Planet transits in September 2025: నవరాత్రులకు ముందు కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. సెప్టెంబరు 13న కుజుడు తులారాశిలోకి వెళ్లాడు. ఇవాళ అంటే సెప్టెంబరు 15న బుధుడు కన్యారాశి ప్రవేశం చేశాడు. ఈరోజే శుక్రుడు కూడా సింహరాశిలోకి వెళ్లబోతున్నాడు. మరోపక్క గ్రహాల రాజైన సూర్యుడు సెప్టెంబరు 17న కన్యారాశిలోకి ఎంట్రీ ఇస్తాడు. పైగా సెప్టెంబరు 21న సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. వీటిన్నింటి ప్రభావం ద్వాదశ రాశులపై ఖచ్చితంగా పడుతుంది. ఈ గ్రహ సంచారాల వల్ల మూడు రాశులవారు మాత్రం నక్కతోక తొక్కబొతున్నారు. ఆ రాశులు ఏవో ఓ లుక్కేద్దాం.

- Advertisement -

ధనస్సు రాశి
గ్రహాల రాశి మార్పు వల్ల ధనస్సు రాశి వారి ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. మిమ్మల్ని చూసి నవ్వుకున్నవాళ్లే ఇప్పుడు ఈర్ష్య చెందుతారు. జాబ్ కోసం ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కోరుకున్న వ్యక్తితోనే పెళ్లి కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

వృషభరాశి
గ్రహాల మార్పు వృషభరాశి వారికి వరమనే చెప్పాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ లో ఎప్పుడూ చూడని గ్రోత్ చూస్తారు. డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ యువతకు మంచి రోజులు రాబోతున్నాయి. వ్యక్తిగత, వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ప్రేమ పరిణయానికి దారి తీస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

Also Read: Surya Grahan 2025 -మీకు కుబేర యోగం పట్టాలంటే.. సూర్యగ్రహణం రోజున ఇలా చేయండి..

సింహరాశి
ఇదే రాశిలో సూర్యగ్రహణం సంభవించబోతుంది. దీని కారణంగా సింహరాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారం అవుతుంది. కెరీర్ లో ఆకస్మిక ఎదుగుదల ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అదృష్టం కలిసి వచ్చి మీరు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. సంసార జీవితంలో కలతలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు.

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాల పై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News