Benefits of Gajakesari Raj Yoga: రేపటి నుంచి పితృపక్షం మెుదలుకానుంది. 15 రోజులపాటు ఉండే పితృ పక్ష సమయంలో పుష్కర కాలం తర్వాత అరుదైన గజకేసరి రాజయోగం రూపుదిద్దుకోబోతుంది.సెప్టెంబరు 14న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే సమయంలో దేవ గురు బృహస్పతి అదే రాశిలో ఉంటాడు. మిథునరాశిలో వీరిద్దరి కలయిక శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని సృషించబోతుంది. దీని ఎఫెక్ట్ పితృ పక్షం చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో మూడు రాశుల వారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి
చంద్రుడు, గురుడు కలయిక సింహరాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ జాతకంలోని 11వ ఇంట్లో ఈ శక్తివంతమైన యోగం ఏర్పడబోతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో భారీగా జంప్ ఉంటుంది. ఆదాయం సంబంధించిన అనేక మార్గాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీగా లాభాలను ఇస్తాయి. మీ కోరికలు సకాలంలో నెరవేరుతాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది.
వృషభ రాశి
గజకేసరి రాజయోగం వృషభరాశి వారి జాతకాన్ని మార్చబోతుంది. ఇది మీ కుండలిలోని రెండో ఇంట్లో ఏర్పడబోతుంది. వీరి ఆదాయం వృద్ధి చెందే ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఆకస్మిక పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కు అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. భార్యభర్తలు రొమాంటిక్ సమయం గడుపుతారు. కుటుంబంలో ఆనందంతోపాటు ఐశ్వర్యం ఉంటుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీరు అప్పులు ఊబి నుండి బయటపడతారు.
Also Read: Indira Ekadashi -2025లో ఇందిరా ఏకాదశి ఎప్పుడు? పూజ ఎలా చేయాలో తెలుసా?
కన్య రాశి
కన్య రాశి వారికి గజకేసరి రాజయోగంతో సుడి తిరగబోతుంది. ఈయోగం మీ జాతకంలో పదో ఇంట్లో ఏర్పడుతోంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని తక్కువ టైంలోనే సాధిస్తారు. ఆఫీసులో మీ బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. సంసార జీవితం బాగుంటుంది. లవ్ సక్సెస్ అవుతుంది. నిరుద్యోగులకు జాబ్ దొరకుతుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని పండితుల సూచనలు, నిపుణుల సలహా మేరకు ఇవ్వడమైనది. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


