Gajakesari Raja Yoga Effect: గ్రహ సంచారాల పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనది. భూమి యెుక్క ఉపగ్రహమైన చంద్రుడు ఇవాళ(జూలై 01) కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే బుధుడు అదే రాశిలోఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల కొందరి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఆ లక్కీ రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
గజకేసరి రాజయోగం మిథునరాశి వారి తలరాతను మార్చబోతోంది. మీరు కోరుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. మీరు ఈ సమయంలో ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువులు మీతో ఎప్పుడూ సఖ్యతగా ఉంటారు. మీకు ప్రతి పనిలో లక్ మీ వెంటే ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు మీకు లాభిస్తాయి. మీ జీవితంలో మరో మెట్టు ఎదుగుతారు. వైవాహిక జీవితం ఇంతకముందు కంటే సాఫీగా సాగబోతుంది. పెండింగ్ లో ఉన్న పనులను కంప్లీట్ చేస్తారు.
వృషభరాశి
బుధుడు, చంద్రుడు సంయోగం కారణంగా సంభవించబోతున్న గజకేసరి రాజయోగం వృషభరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండనుంది. మీరు కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈ టైం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా డబ్బును సంపాదిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది.
కన్యా రాశి
గజకేసరి రాజయోగం వల్ల కన్యారాశి వారి సుడి తిరగబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతంది. మీ ధనం విపరీతంగా పెరగనుంది. మీ కెరీర్ అనుకున్న దాని కంటే వేగంగా దూసుకుపోతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతోంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వివాహ ప్రతిపాదన రావచ్చు. మనసుకు శాంతి లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.