Benefits of Gajakesari yogam: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. ఆగస్టు 17,18,19 తేదీల్లో చంద్ర, బుధ గ్రహాల సంచారం వల్ల గజకేసరి రాజయోగం సృష్టించబోతుంది. ఈ యోగం చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సంపద వృద్ధి చెందుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే అనుకూల సమయం. నూతన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. పనులన్నీ సమయానికి కంప్లీట్ అవుతాయి. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. వైవాహిక జీవితంలో కలతలన్నీ తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. మీ అప్పులన్నీ తీరిపోతాయి. సంతానప్రాప్తికి అవకాశం ఉంది.
కన్యా రాశి
గజకేసరి రాజయోగం కన్యారాశి వారికి ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. అనారోగ్యం నుండి బయటపడతారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దాంపత్య జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. గుడ్ న్యూస్ వింటారు.
తుల రాశి
గజకేసరి రాజయోగం వల్ల తులా రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరుతాయి. భారీగా స్థిర చరాస్థులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఈ టైం బాగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈసారి భారీగా లాభాలను ఇస్తాయి. చాలా రోజుల నుంచి జాబ్ కోసం ఎదురుచూసే వారి డ్రీమ్ నెరవేరబోతుంది. ఆగస్టులో మీ సుడి తిరగబోతుంది. మీరు అడుగు పెట్టే ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది.
Also Read: Shukra Gochar 2025 – ఆగస్టు 23న శుక్రుడు అద్భుతం.. ఈ 5 రాశులకు సుడి తిరగడం ఖాయం..
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన వార్త మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also Read: Ketu Planet- ఆ 4 రాశులను కోటీశ్వరులను చేయనున్న కీడు గ్రహం.. ఇందులో మీది ఉందా?


