Sunday, November 16, 2025
HomeదైవంVinayaka Chavithi 2025: వినాయక చవితి పూజలో దోసకాయ ఎందుకు పెడతారో తెలుసా?

Vinayaka Chavithi 2025: వినాయక చవితి పూజలో దోసకాయ ఎందుకు పెడతారో తెలుసా?

Vinayaka Chavithi 2025 Puja items: రేపే వినాయక చవితి. దేశం మెుత్తం వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మార్కెట్లన్నీ గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రితో కిటకిటలాడుతున్నాయి. వినాయక చవితి రోజు పూజలో ఉండ్రాళ్లు, లడ్డూలు, 21 రకాల పత్రాలు, పూలు, పళ్లు నైవేద్యంగా సమర్పించడం మనందరికీ తెలుసు. కానీ వినాయకుడి పూజలో తప్పక ఉండాల్సిన ఐటెమ్ మరొకటి ఉంది. అదే దోసకాయ. దీనిని గణపతి ఆరాధనలో ఎందుకు నైవేద్యంగా పెడతారు, దీని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం.

- Advertisement -

కారణం ఇదే..

పురాణాల ప్రకారం, వినాయకుడి తల్లి పార్వతీదేవి కుమారుడు. అయితే గణపతి ఆ జగన్మాత గర్బం నుంచి కాకుండా పసుపు ముద్దతో పుట్టాడు. సాధారణంగా బిడ్డలు జన్మించినప్పుడు బొడ్డుతాడు కోసే ఆచారం ఉంటుంది. కానీ గణపతి బొడ్డుతాడు లేకుండా పుట్టాడు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా దోసకాయను నైవేద్యంగా పెట్టి దానిని నరికి బొడ్డుతాడు కోసే ఆచారాన్ని పాటించారు. ఈ విధంగా వినాయకుడు గర్భం నుంచి పుట్టినవాడిగా భావించి అతడికి సంపూర్ణ జన్మను ఇచ్చినట్లుగా భావిస్తారు.
మరోక కథనం ప్రకారం, గణపతి ఆకలిని తీర్చేందుకు పార్వతీ దేవి దోసకాయ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: Mercury Transit 2025 -భద్ర రాజయోగంతో ఈ 3 రాశులు నక్కతోక తొక్కినట్లే..!

దోసకాయ బెనిఫిట్స్

దోసకాయను నైవేద్యంగా పెట్టడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు దీని వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పండుగ సమయంలో వాతావరణ మార్పు కారణంగా శరీరంలో హీటెక్కే అవకాశం ఉంది. దీనిని తినడం వల్ల బాడీ వేడి తగ్గుతుంది. అంతేకాకుండా మిమ్మల్ని డీహైడ్రేషన్ బారి నుంచి కూడా ఇది రక్షిస్తుంది. దోసకాయలో ఉండే పీచు పదార్థాలు (ఫైబర్) జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. శరీరం నుండి టాక్సిక్ పదార్థాలను తొలగించడంలో దోసకాయ సహాయపడుతుంది.

Also read: Radhashtami 2025 – రాధాదేవి శ్రీకృష్ణుడి ప్రేయసా లేదా భార్య? పురాణాలు ఏం చెబుతున్నాయి?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad