తెలుగువారి పండుగలలో ఉగాది పర్వదినం అతి ముఖ్యమైనది ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం ప్రతిఏటా నిర్వహించడం అనవాతీగా వస్తుంది. శ్రీ క్రోధ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో దేవాలయ అర్చకులు కెఎల్ఎన్ చార్యులు ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. తొలుత గోదా దేవి సమేత లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పంచాగ శ్రవణం ప్రారంభించారు. నూతన సంవత్సరంలో వర్తమాన, భవిష్యత్ పై పంచాంగాన్ని వివరించారు. భక్తులకు తీపిచేదు కలయికల ఉగాది పచ్చడిని వితరణ చేశారు.
రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు, సాఫ్ట్వేర్ రంగం అదేవిధంగా, అన్ని రంగాల వారికి శ్రీ క్రోధ నామ సంవత్సరం అంతా శుభాలే కలుగుతాయని పంచాంగకర్త వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు , గంగావత్ లక్ష్మణ్ నాయక్, కోట ఉత్తరయ్య డాక్టర్ రామారావు రంగారావు శ్రీనివాసరావు విద్యాసాగర్ నారాయణరావు శ్రీనివాస్ మనోజ్ తదితరులు ఉన్నారు.