Saturday, October 12, 2024
HomeదైవంGarla: భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు

Garla: భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు

గుళ్లకు శ్రావణ శోభ

శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని పలు ఆలయాలకు శ్రావణ శోభ సంతరించుకుంది. మహిళలు అమ్మవారిని దర్శించుకుని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో స్థానిక భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు నంగునూరి ప్రవీణ్ కుమార్ శర్మ స్వామివారిని పూలు మారేడు దళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఏకాదశ రుద్రాభిషేకం పంచామృతాభిషేకలతో విశేష పూజలు నిర్వహించారు.

- Advertisement -


తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తజనం పెద్ద ఎత్తున శివ నామాన్ని స్మరించడంతో శివాలయం మొత్తం శివ నామస్మరణతో మార్మోగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News