గార్ల మండలం మర్రిగూడెం సమీపంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన ఆదివారం స్వామివారి తెప్పోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు ఆలయం ఎదుట ఉన్న కోనేరులో తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగాక మూడో రోజున తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించిన శకటంపై ప్రతిష్టించి కోనేరులో తెప్పోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ నల్లగొండ సూర్యాపేట తదితర జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి తెప్పోత్సవం వేడుకను కన్నులారా వీక్షించి, తమ కోరికలు నెరవేర్చాలని ముడుపులు కట్టి ముక్కులు చెల్లించారు.
కోనేటిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ప్రత్యేక శకటంపై విహరించే సమయంలో భక్తులు భక్తి భావంతో పూలు పసుపు కుంకుమ చిల్లర నాణాలు కోనేటిలో విడిచి స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణతో ఆలయం ప్రాంగణం మొత్తం మార్మోగింది. ఎండోమెంట్ కార్యనిర్వాక అధికారిని సమత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన తెప్పోత్సవంలో ఆర్యవైశ్య సంఘం వారు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్సైలు జీనత్ కుమార్ తిరుపతి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుడి నిర్మాణ దాతలు పులి గోపాల్ రెడ్డి ప్రమీల రెడ్డి దంపతులు అజ్మీరా బన్సీలాల్ పుల్లఖండం రమేష్ బాబు మల్లం పరికిషన్ నరేందర్ పరుచూరి కుటుంబరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కస్నా నాయక్ టీటీడీ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు రాములు నాయక్ కోట వీరభద్రం నరేష్ సంపత్ శ్రీనివాస్ గుప్తా వేమిశెట్టి శ్రీనివాస్ పుల్ల కాండం వేణుగోపాల్ కనక శేఖరం అర్చకులు అచ్చుత్ చార్య గోవిందా చార్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.