Sunday, October 6, 2024
HomeదైవంGodavarikhani: సాముహిక వరలక్ష్మి పూజలు

Godavarikhani: సాముహిక వరలక్ష్మి పూజలు

నిర్వహించిన విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని కోదండ రామాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతంలోని మాతృమూర్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మాతృశక్తి ప్రముఖులు మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం అందరికీ ఆనందకరమని, సంతోషకరమైనదన్నారు.

- Advertisement -

అమ్మవారి కటాక్షం, అమ్మవారి ఆశీస్సులు ప్రతి హిందూ బంధువుల పైన ఉండాలని కోరుకొన్నారు. మహిళలు మన హిందూ ధర్మాన్ని తమ యొక్క పిల్లలకి నేర్పించాలని, దైవరాదన నేర్పించాలని, హిందుత్వంపై, హిందూ ధర్మంపై, హిందూ మహిళలపై మన సాంప్రదాయాలపైన జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మహిళలు ముందుండాలని కోరారు.

మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని హిందుత్వంపై తెలియపరిచే బాధ్యత మనందరిని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరావు, జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్, జిల్లా కోశాధికారి నేరేడు కొమ్మ వెంకటస్వామి, గోరక్ష ప్రముక్ ఇసంపల్లి వెంకన్న, మాతృ శక్తి సంయోజక జ్యోతి, నగర కార్యదర్శి బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ సంపత్, కుంభవర్ దిగంబర్ అన్నపూర్ణమ్మ, మమత, తిరుమల, అంజయ్య, భవాని, సురేందర్, సత్యనారాయణ, లింగన్న, సంపత్, రాజు, శ్రీనివాస్, అరవింద్, కార్తీక్, వెంకటేష్, వినయ్, బాలికలు, మహిళా కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News