Tuesday, September 10, 2024
HomeదైవంGonegandla: జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

Gonegandla: జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

పాలపిట్టను చూసేదెందుకో తెలుసా?

గోనెగండ్ల మండలంలో వెలసిన వివిధ దేవాలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా వివిధ రూపాల్లో ప్రతిరోజు అమ్మవార్లు అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ ఉదయం అమ్మవార్లకి ఆలయ అర్చకులు, గ్రామ ప్రజలు, భక్తులచే ప్రత్యేక పూజలు జలాభిషేకం, కుంకుమార్చన, బిల్వర్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను తొమ్మిది రోజుల నుండి ప్రతిరోజు ఉదయం వివిధ రూపాల్లో అమ్మవార్లను అతి సుందరంగా అలంకరించారు. దుర్గాష్టమి సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

- Advertisement -

ఆ రోజే పాలపిట్టను ఎందుకు చూస్తారు?

దసరా రోజున పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావించి ప్రజలు ప్రత్యేకంగా ఊరి చివరకు, పొలాలకు వెళ్లి మరీ పాలపిట్ట కనిపిస్తుందేమోనని చూస్తారు. త్రేతా యుగంలో రావణాసురిడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో పాలపిట్ట కనిపిస్తుంది. ఆరోజు విజయదశమి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తారు. దీంతో పాలపిట్టను చూడడం శుభశకునంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.

జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు?

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టుకు మొక్కడం ప్రారంభించారని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పెద్దలు,వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News