Thursday, February 20, 2025
HomeదైవంGonegandla: శ్రీశైలం కాలినడక భక్తులకు ఉచిత అన్నదాన

Gonegandla: శ్రీశైలం కాలినడక భక్తులకు ఉచిత అన్నదాన

శివ మాలాధారులకు..

గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు పెట్రోల్ బంకు వద్ద కాలినడకన శ్రీశైలం వెళ్లే శివ స్వాములకు ఉచిత అన్నదాన శిబిరాన్ని వీరశైవ పీఠాధిపతులు పూజారి శివయ్య స్వామి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజారి శివయ్య స్వామి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా శ్రీశైలం కాలినడకన వెళ్లే శివ స్వాములకు ఉచిత అన్నదాన కార్యక్రమం గోనెగండ్ల, కులుమాల గ్రామ ప్రజలు, పెద్దల నిర్వహణలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉచిత అన్నదాన శిబిరానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభం: సిఐ గంగాధర్

శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని, ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా, శివ మాలను ధరించి కాలినడకన శ్రీశైలం వెళ్తున్న భక్తులకు గోనెగండ్లకు చెందిన ఫార్మసిస్ట్ కృష్ణ కుమార్ అలియాస్ కిట్టు,అర్ యం పీ వైద్యులు నాగేశ్ రెడ్డిలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గోనెగండ్ల సీఐ గంగాధర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, మహేష్, గోనెగండ్ల, కులుమాల గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News