Saturday, November 23, 2024
HomeదైవంGonegandla: శ్రీ మహాలక్ష్మి గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణోత్సవము

Gonegandla: శ్రీ మహాలక్ష్మి గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణోత్సవము

వీరంపల్లి గ్రామంలో..

గోనెగండ్ల మండల పరిధిలోని వీరంపల్లి గ్రామంలో వెలసిన మహిమాన్వితుడు శ్రీ శ్రీ వీరబ్రహ్మం స్వాముల వారి, శ్రీ మహాలక్ష్మి గోవిందమాంబ 28వ తిరుణాల మహోత్సవ సందర్భంగా పూజ అభిషేకం, రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8:45 నిమిషాల నుండి శ్రీ మహాలక్ష్మి గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గ్రామోత్సవము మరియు ఉదయం11 గంటల 35నిమిషాలకు శ్రీ మహాలక్ష్మి గోవిందమాంబ సమేత శ్రీ బ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణోత్సవము నిర్వహిస్తామని, సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాలకు రథోత్సవము నిర్వహించబడునని, అలాగే బ్రాహ్మణ స్వాముల వారి దేవాలయం నందు భజన కార్యక్రమము ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

స్వాముల వారి ఆశీస్సులు పొందేందుకు వచ్చిన భక్తులకు ఉదయం నుండి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కావున స్వాములవారి ఆశీస్సులకు పాత్రులై పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొని వారి కృపను పొందగలరన్నారు. 19న(ఆదివారం) ఉదయం 6 గంటలకు పరుగు పందెం పోటీలు నిర్వహిస్తామని, పరుగు పందెంలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ,,2,116 దాత కంపాడు చిన్నరామాంజనేయులు, రెండవ బహుమతి 1516 , మూడో బహుమతి 1016 ,దాత ఒంటడు దిన్నె కీర్తిశేషులు సీతారామాచారి జ్ఞాపకార్థం వారి మనవడు మల్లికార్జునాచారి అందిస్తారన్నారు.

అలాగే 19న మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహిస్తామని, ఎద్దులు బండ లాగు పోటీలలో మొదటి బహుమతి రూ20వేల16 దాతలు గ్రామ ప్రజల సహకారంతో అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. రెండో బహుమతి రూ,,15 వేల16 దాతలు పెద్ద బజారు కుమారుడు రవికుమార్, గాండ్ల నాగన్న కుమారుడు వెంకటేష్, మూడో బహుమతి రూ,,10,016 దాత తలారి లింగన్న కుమారుడు దస్తగిరి ల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు.

గ్రామంలో జరుగు తిరుణాల మహోత్సవంలో పాల్గొనే ఎద్దుల జత యజమానులు ఎంట్రీ ఫీజు ₹1000 చెల్లించి ,పేర్లను నమోదు చేసుకోవాలని గ్రామ పెద్దలు తెలియజేశారు. శ్రీ శ్రీ వీరబ్రహ్మం స్వాముల, శ్రీ గోవిందమాంబ తిరుణాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా గ్రామస్తులు పెద్దలు, యువకులు, మహిళలు సహకరించాలని ఆలయ ధర్మకర్త విశ్వబ్రాహ్మణ సంజీవయ్య ఆచార్యులు తెలిపారు.వివరాలకు క్రింది నెంబర్ 9948101986 నెంబర్ లను సంప్రదించగలరన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News