Saraswati Antya Pushkaralu: అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) తీపి కబురు అందించింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక పుణ్యయాత్ర ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. భక్తులకు ఆధ్యాత్మికంగా, సురక్షితమైన యాత్రా అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరంలో జరుగుతున్న ఈ పవిత్ర పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ ఈ ప్రత్యేక టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ప్యాకేజీలో భాగంగా సందర్శనీయ స్థలాలు:
- పవిత్ర పుష్కర స్నానం: కాళేశ్వరంలోని పవిత్ర గోదావరి-ప్రాణహిత త్రివేణి సంగమ తీరాన పుష్కరిణి స్నానం.
- దివ్య దర్శనం: ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ దర్శనం.
- చారిత్రక సందర్శన: యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కట్టడంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప దేవాలయం సందర్శన.
అధికారిక వెబ్‌సైట్: ఈ ప్రత్యేక పుణ్యయాత్ర ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి భక్తులు అధికారిక వెబ్‌సైట్ tourism.telangana.gov.inను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 98481 25720, 83672 85285 ఫోన్ నంబర్లకు కాల్ చేసి యాత్ర వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పుష్కర స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకోవాలని పర్యాటక శాఖ కోరింది.
పుణ్యయాత్ర ప్యాకేజీ వివరాలు:
ఏసీ హైటెక్ స్లీపర్ కోచ్ ప్యాకేజ్:
- పెద్దలకు చార్జీ: రూ. 3,600
- పిల్లలకు చార్జీ: రూ. 2,880
ఏసీ మినీ కోచ్ ప్యాకేజ్:
- పెద్దలకు చార్జీ: రూ. 2,800
- పిల్లలకు చార్జీ: రూ. 2,240

