Lucky Zodiacs in July 2025: మరో రెండు రోజుల్లో జూలై నెల మెుదలుకాబోతుంది. ఈ నెలలో కొన్ని గ్రహాల గమనంలో కీలకమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జూలై 09న దేవగురు బృహస్పతి మిథునంలోకి, 16న గ్రహాల రాజు సూర్యుడు కర్కాటక రాశిలోకి, 26న శక్రుడు మిథునరాశిలోకి, 28న కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నారు. వీటితోపాటు జూలై 18న బుధుడు కర్కాటక రాశిలో తిరోగమనం చెంది.. అదే రాశిలో 24న అస్తమించబోతున్నాడు. గ్రహాల యెుక్క ఈ రాశి మార్పు కొందరి జీవితాల్లో వెలుగులు నింపనున్నాయి. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
గ్రహ సంచారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. లైఫ్ లో సెటిల్ అవుతారు. వ్యాపారం విస్తరించడం వల్ల లాభాలు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ సమయంలో చేసే పెట్టుబడులు భారీగా లాభాలను పొందుతారు. దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, బిజినెస్ లో మీ దశ తిరిగి భారీగా డబ్బు వచ్చి పడుతుంది.
కుంభరాశి
జూలైలో గ్రహాల మార్పులు కుంభరాశివారికి శుభప్రదంగా ఉండనుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పెళ్లికాని యువకులు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి పొజిషన్ కు చేరుకుంటారు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనేకునేవారి కోరిక ఫలిస్తుంది. మీకు సంతాన సుఖం కలుగుతుంది.
మేష రాశి
జూలైలో గ్రహాల సంచారం మేషరాశి వారికి మేలు చేయబోతుంది. ఇక నుంచి మీ కష్టలన్నీ తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కుదుటుపడుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుముడిస్తాయి. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా అందరి కంటే ఉన్నత స్థితిలో ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ ఖర్చులు పెరిగినప్పటికీ మీరు మేనేజ్ చేయగలుగుతారు. లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి.
వృషభరాశి
వచ్చే నెలలో గ్రహాల గమనంలో మార్పు వల్ల వృషభ రాశి వారికి అంతా మంచే జరగనుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి. బాస్ నుంచి ప్రశంసలు అందుకోవడంతోపాటు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి మళ్లీ ఒకటవుతారు.