Thursday, January 30, 2025
Homeదైవంగుప్త నవరాత్రులు అంటే ఏంటో తెలుసా..? శ్యామలా దేవి పూజ ఎలా చేయాలంటే..?

గుప్త నవరాత్రులు అంటే ఏంటో తెలుసా..? శ్యామలా దేవి పూజ ఎలా చేయాలంటే..?

మాఘ మాసంలో చేసే గుప్త నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనినే శ్యామలా నవరాత్రులు అని కూడా అంటుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో రాష్ట్రాల్లో కంటే.. ఉత్తరాదివారికి ఈ నవరాత్రుల గురించి బాగా తెలుసు. ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 07 వరకూ జరుపుకుంటారు. హిందువులు శక్తి ఆరాధనకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆచారానికి అత్యున్నత శక్తి అయిన అమ్మవారి ఆవాహనకు ప్రతీకగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది నవరాత్రులు 4 సార్లు వస్తాయి.

- Advertisement -

అందులో చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అలాగే, ఆంగ్ల సంవత్సరంలో గుప్త నవరాత్రులు వచ్చాయి. ఈ నవరాత్రుల సమయంలో గుప్తంగా పూజలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చునని నమ్ముతారు. ఇంతకీ రాజశ్యామల గుప్త నవరాత్రుల ప్రాముఖ్యతలేంటి.. అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది.. 9 నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఏయే రూపాల్లో పూజిస్తారు అనే పూర్తి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

శక్తి ఆరాధనకు తొమ్మిది రోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు.. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. దసరాల్లో వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే మాఘ గుప్త నవరాత్రుల్లోనూ శ్యామలాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు. గుప్త నవరాత్రులు హిందువులకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ సమయంలో శక్తి, రక్షణను సూచించే దుర్గాదేవి ఆరాధన, తపస్సు వంటివి చేస్తారు. అడ్డంకులను అధిగమించి, విజయాన్ని సాధించడానికి.. జ్ఞానాన్ని పొందేందుకు, శ్రేయస్సు కోసం ఈ నవరాత్రులు చేస్తుంటారు భక్తులు.

ఆవాహన చేసే విధానం:
ఒక కలశం ఉంచి దుర్గాదేవిని ఆవాహన చేసి.. నవరాత్రులు చేస్తుంటారు భక్తులు. ఇక పూజ జరిగే ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత అమ్మవారిని ఆరాధించాలి. పవిత్రతను కాపాడుకోవడానికి ఇది ముఖ్యమైనదిగా చెబుతారు. ఇక కలశాన్ని సిద్ధం చేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతుంటారు. కలశాన్ని తీసుకొని శుభ్రమైన నీటితో నింపండి. కలశం పైన కొన్ని మామిడి ఆకులను వేసి కొబ్బరికాయతో కప్పండి. కలశాన్ని శుభ్రమైన వస్త్రం లేదా చెక్కపై ఉంచాలి. దీనిని పూజా ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇది దుర్గా దేవి దైవిక ఉనికిని సూచిస్తుంది.

పూజా విధానం:
ముందుగా కలశానికి ముందు ఓ పసుపు గణపతిని ఉంచి.. దీపం వెలిగించి విఘ్నాలు తొలగిపోవడానికి పూజించాలి. నిత్యం గణపతి వందన పఠించడం ద్వారా పూజ ప్రారంభించాలి. ఆ తరువాత దుర్గా సప్తశతి, నవరాత్రి స్తోత్రాన్ని 9 రోజులలో అమ్మవారి ఆశీర్వాదం కోసం పఠించాలని పండితులు చెబుతున్నారు. దీనితో పాటు శక్తి నామాలు పటిస్తూ కలశానికి అక్షతలు, పువ్వులతో పూజ చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా కలశానికి తాజా పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుడు, బియ్యం వంటి ఇతర వస్తువులను సమర్పించండి. దీనితో పాటు అమ్మవారికి నైవేద్యం సమర్పించండి.
పూజ సమయంలో పూలు అనేవి పవిత్రమైన సమర్పణలుగా చెప్పవచ్చు.

కలశం ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇది చీకటిపై కాంతి విజయాన్ని, చెడుపై మంచిని సూచిస్తుంది. మాఘ గుప్త నవరాత్రుల 9 రోజులలో, భక్తులు ఉపవాసాలను ఆచరిస్తారు. దుర్గాదేవికి రోజువారీ ప్రార్థనలు చేస్తారు. ఉపవాసం చేసే వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి పూర్తి లేదా పాక్షికంగా ఉంటుంది. భక్తులు తమ ఇళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పండుగ సందర్భంగా సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతారు. దుర్గామాత హారతితో పూజను ముగించండి.

ఏ రోజు ఏ రూపంలో పూజించాలంటే: ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తుంటారు. జనవరి 30 (1వ రోజు) కాళికా దేవి, జనవరి 31 (2వరోజు) త్రిపుర (శైలపుత్రి) తారా దేవి, ఫిబ్రవరి 1 (3వరోజు) సుందరీ (బ్రహ్మచారిణి) దేవి, ఫిబ్రవరి 2 (4వరోజు) భువనేశ్వరి దేవి, ఫిబ్రవరి 3 (5వరోజు) మాతా చిత్రమాతా త్రిపుర దేవి, ఫిబ్రవరి 4 (6వరోజు) భైరవి (స్కంద మాత) దేవి, ఫిబ్రవరి 5 (7వరోజు) మధుమతి (శక్తి) దేవి, ఫిబ్రవరి 6 (8వరోజు) మాతా (కాత్యాయని) బాగళాముఖి దేవి, ఫిబ్రవరి 7 (9వరోజు) మాతంగి కమలాదేవి గా పూజిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News