Guru Aditya Yogam Effect On Zodiacs: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే మీరు ఎలాంటి కార్యమైనా సులభంగా సాధిస్తారు. మరోవైపు గ్రహాల రాజైన సూర్యుడిని విజయానికి కారకుడిగా భావిస్తారు. అలాంటి రాజు, గురువు ఒకే రాశిలో కలవబోతున్నారు. వీరిద్దరి కలయిక కారణంగా అరుదైన గురు ఆదిత్యయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం మూడు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏయే తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి గురు, బృహస్పతి కలయిక మీరు ఊహించనంత సంపదను ఇస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీ కెరీర్ లోని ఒడిదుడుకులు తొలగిపోతాయి. వ్యాపారులు భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తారు. మీకు వివాహ యోగం ఉంది. కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలుమగల జీవితం సాఫీగా సాగిపోతుంది. మీరు ప్రతి పనిలో సక్సెస్ పుల్ అవుతారు. మీకు లక్ తోపాటు ఐశ్వర్యం ఉంటుంది. మీరు భారీస్థాయిలో ఆస్తులు, బంగారం కొనుగోలు చేస్తారు.
సింహ రాశి
గురు ఆదిత్య రాజయోగం సింహరాశి వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. మీకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. ఊహించనంత ధనలాభం ఉంటుంది. మీకు వివాహ ప్రాప్తి ఉంది. అంతేకాకుండా నూతన వధూవరులకు సంతానసుఖం కలుగనుంది. మీరు లైఫ్ లో ఎవ్వరూ చేరుకోలేని ఎత్తుకు చేరుకుంటారు. ఫారిన్ వెళ్లాలనే మీ ఆకాంక్ష నెరవేరుతోంది. మీ గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి.
కన్యా రాశి
గురు ఆదిత్య రాజయోగం వల్ల కన్యారాశి వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. మీరు ఆర్థికంగా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటారు. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీ సంపద నాలుగు రెట్లు పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది.


