Guru Gochar July 2025: జూలై నెల మెుదలైంది. ఈ నెలలో గ్రహాలు మరియు నక్షత్రరాశులలో పెద్ద మార్పు రానుంది. ప్రస్తుతం అస్తమించిన దేవగురు బృహస్పతి మెుదటి వారంలో ఉదయించబోతున్నారు. గ్రహాల కదలిక మెుత్తం 12 రాశిచక్రాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే గురుడు అస్తమించినప్పుడు లేదా ఉదయించినప్పడు అది శుభకార్యాలపై కచ్చితమైన ప్రభావాన్ని అయితే చూపుతుంది.
జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని, శుక్రుడిని వైవాహిక జీవితానికి సంబంధించిన గ్రహాలుగా పరిగణిస్తారు. గత నెల 11న గురువు అస్తమించాడు. దాంతో వివాహ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. గురుడు మళ్లీ ఉదయించిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ యథావిథిగా జరుగుతాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. సూర్యుడు కూడా అద్ర నక్షత్రంలో కదులుతున్నాడు, కాబట్టి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 09న ఉదయించబోతున్న గురుడు ఎనిమిది నెలలపాటు అదే స్థితిలో ఉండనున్నాడు. దీంతో శుభకార్యాలు, మతపరమైన కార్యకలాపాలన్నీ తిరిగి మెుదలవుతాయి. ఈలోగా శుక్రుడు కానీ అస్తమిస్తే ఇవన్నీ మరోసారి ఆగిపోతాయి.
దేవగురు బృహస్పతిని జ్ఞానం, ఆనందం, అదృష్టం మరియు సంతానానికి కారకుడిగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. మనం చదువులో రాణించాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, ఆద్యాత్మికతపై ఆసక్తి పెరగాలన్నా బృహస్పతి ఆశీస్సులు కావాలి. ప్రస్తుతం గురుడు మిథునరాశిలో అస్తమించాడు కాబట్టి అతని శక్తి క్షీణించి ఉంటుంది. ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు ఏ మాత్రం ఏమరపాటు తగదు. మాటలను అదుపులో ఉంచుకోండి.
మళ్లీ గురుడు జూలై 09 రాత్రి 10:50 గంటలకు అదే రాశిలో ఉదయించబోతున్నాడు. దీంతో మళ్లీ అతని శక్తి అతని తిరిగి వస్తుంది. అప్పటి నుంచి రాశులపై అతడి శుభప్రబావం మెుదలవుతుంది. దేవగురు యెుక్క ఈ మార్పు మీ జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తితో జ్ఞాన సముపార్జన చేస్తారు. జీవితంలో కొత్త ఎత్తులకు చేరుకుంటారు. పెళ్లిళ్లు కుదురుతాయి. సంతానప్రాప్తి కలిగే సూచనలైతే ఉన్నాయి. ఏదైనా ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. బృహస్పతి పెరుగుదల మీకు ఎన్నో విధాలుగా అనుకూలంగా ఉంటుంది.