Guru Purnima 2025 Date and Time: ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు. ఈ సంవత్సరం గురుపౌర్ణమి (గురు పూర్ణిమ) జూలై 10న వచ్చింది. ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈరోజున కొంత మంది ఉపవాసం కూడా పాటిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి, భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు.
వ్యాస పౌర్ణమి అని ఎందుకంటారు?
వ్యాసభగవానుడిని మానవాళి మెుత్తానికి గురువుగా భావిస్తారు. ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు. అందుకే అతనిడి వేదవ్యాసుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు. అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు.
గురు పౌర్ణమి గురువు-శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక. మన హిందూ పురాణాల్లో ఇటువంటి సంబంధాలకు ఉదాహరణలు అనేకం చూడవచ్చు. రామలక్ష్మణులు-విశ్వామిత్రుడు, బలరామకృష్ణులు-సాందీప ముని, ద్రోణుడు-అర్జునుడు, పరశురాముడు-భీష్ముడు వంటి గురుశిష్యులు ఎందరో కనిపిస్తారు.
గురు పూర్ణిమ నాడు శక్తివంతమైన యోగం
హిందువులు ఈ గురు పౌర్ణిమ నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి. ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమి జూలై 10 అంటే గురువారం నాడు రాబోతుంది. ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గురు పౌర్ణమి తేదీ, శుభ ముహూర్తాలు:
గురు పూర్ణిమ తేదీ: జూలై 10(గురువారం)
తిథి ప్రారంభం: జూలై 9 బుధవారం తెల్లవారుజామున 1: 37 గంటలకు
తిథి ముగింపు : జూలై 10 అర్థరాత్రి
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4: 10 నుంచి 4: 50 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11: 59 నుంచి 12: 54 వరకు
విజయ ముహూర్తం: మద్యాహ్నం 12: 45 నుంచి 7: 41 వరకు
గోధూళి ముహూర్తం రాత్రి 7: 21 నుంచి 7: 41 వరకు