Guru Shukra Conjunction in Gemini 2025: శుభాలనిచ్చే శుక్రుడు రేపు మిథునరాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇప్పటికే సూర్యభగవానుడు అదే రాశిలో సంచరించబోతున్నాడు. వీరిద్దరి సంయోగం ఆగస్టు 20 వరకు ఉండబోతుంది. గురు-శుక్రల కలయిక మూడు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ధనధాన్యాలకు లోటు ఉండదు. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి సంయోగం వల్ల వృషభం, మిథునం, సింహ రాశులవారు మంచి ఫలితాలను పొందబోతున్నారు.
మిథునం
ఇదే రాశిలో శుక్రుడు, గురుడు కలయిక జరగబోతుంది. వీరి సంయోగం మిథునరాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. బిజినెస్ లో చాలా లాభాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది.
వృషభం
గురు, శుక్రుల కలయిక వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. మీ కుటుంబ సమస్యలు పరిష్కరమవుతాయి. మీ ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహ రాశి
గురు, శుక్రుల సంయోగం సింహరాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇవ్వనుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. లవ్ సక్సెస్ అవుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. కెరీర్ బాగుంటుంది.


