HomeదైవంGuru Vakri 2025: వక్రగమనంలో గురుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..

Guru Vakri 2025: వక్రగమనంలో గురుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..

Guru Vakri 2025 effect on Zodiac Signs: పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. నవగ్రహాల్లో ఇతడి సంచారం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపతుంది. రెండు రోజుల కిందట గురుడు కర్కాటక రాశిలో తిరోగమనం చెందాడు. ఏ గ్రహమైనా వక్రగమనంలో ఉన్నప్పుడు అది ఎక్కువగా ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. గురుడు యెుక్క ఈ రివర్స్ కదలిక మన కెరీర్, సంపద, వివాహం మరియు సంతానం వంటి వాటిపై ప్రభావాన్ని కలిగిస్తుంది. బృహస్పతి యెుక్క ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసా?

- Advertisement -

మిథున రాశి
బృహస్పతి మిథునరాశి యెుక్క రెండో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని వల్ల ఈ రాశి వారు వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో గొడవలు వస్తాయి. అనారోగ్యం బారిన పడవచ్చు. మీ కెరీర్ లో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయలేరు. మీ బాస్ తో వివాదం వస్తుంది. మీ వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగుండదు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మేషం
మేష రాశి యెుక్క లగ్న గృహంలోని నాలుగో ఇంట్లో బృహస్పతి సంచరించబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు జాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు వేసుకున్న ఫ్లాన్స్ అన్నీ పటాపంచలు అవుతాయి. మీరు చేసే పని మరింత ఆలస్యం అవుతుంది. డబ్బు సమస్యలను ఎదుర్కోంటారు. జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళితే అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అడ్డంకులు వస్తాయి. వర్క్ లో ఒత్తిడి పెరుగుతుంది. సంతానం కోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సి రావచ్చు. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారవచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కాస్త సమయం పట్టవచ్చు.

Also Read: Karthika Masam:-రేపే చివరి కార్తీక సోమవారం.. ఇలా చేస్తే మీరు కుబేరులు అవ్వడం ఖాయం..

తులారాశి
తులా రాశి యెుక్క పదో ఇంట్లో గురుడు సంచరించబోతున్నాడు. దీని వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు కష్టాలు మెుదలుకానున్నాయి. ఆఫీసులో సహచరులు, సీనియర్లు లేదా బాస్ తో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పనిలో ఫ్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీ సన్నిహితులు లేదా మిత్రులు వారి స్వలాభం కోసం మిమ్మిల్ని వాడుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కెరీర్ లో సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. అప్పుల వాళ్లు వెంటపడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News