Saturday, April 12, 2025
HomeదైవంHanuman: హనుమాన్ జయంతి నాడు ఈ పనులు అస్సలు చేయకూడదంట..!

Hanuman: హనుమాన్ జయంతి నాడు ఈ పనులు అస్సలు చేయకూడదంట..!

బలము, భక్తి, వినయం, విధేయత, సేవాభావం వంటి అన్ని గొప్ప గుణాల్ని కలిగిన దేవతా రూపం హనుమంతుడు. ఆయుధాల కంటే అపారమైన భక్తి ఒక శక్తిగా ఎలా పనిచేస్తుందో హనుమంతుని జీవితం ఉదాహరణ. శ్రీరాముని భక్తుడిగా సేవ చేసి, ఆయనకు విజయాన్ని అందించిన ఆ పావనరూపుడైన ఆంజనేయస్వామికి భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జయంతి వేడుకలు నిర్వహిస్తారు. నేడు హనుమాన్ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. ఈ పవిత్ర దినాన హనుమంతుని ఆశీస్సులు పొందాలని కోరుకునే భక్తులు కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పనులు తప్పుకోవాలి కూడా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

హనుమాన్ జయంతి రోజు ఎలాంటి పనులు చేయాలి:
హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ఆంజనేయుని అవతారంగా భావించే కోతులకు బెల్లం వంటి మిఠాయిలు తినిపించడం శుభప్రదమని పండితులు చెబుతుంటారు. ఇక అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పాపవిమోచనం కలిగి, శాంతి చేకూరుతుందని సూచిస్తున్నారు. ఇక ఈ ప్రత్యేకమైన రోజున ఆంజనేయుడి విగ్రహానికి సింధూరం అర్పించడం శుభదాయకమని చెబుతుంటారు. అంతేకాదు ఇంట్లో హనుమంతుడిని పూజించే వారు.. నెయ్యి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి.. ఎర్రటి పూలతో పూజ చేస్తే విశేష ఫలితాలు దొందవచ్చంట. హనుమాన్ చాలీసా, ఆంజనేయాష్టకం వంటివి ఫఠించడం కూడా ఎంతో శ్రేయస్కరం అంటున్నారు పండితులు.

చేయకూడని పనులు:
ఈ ప్రత్యేకమైన రోజున తామసిక ఆహారాలు, మద్యపానాలు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ రోజు పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర, మనస్సు పరిశుభ్రత అవసరం. అందుకే వివాహం అయిన వారు కూడా శృంగారానికి దూరంగా ఉండాలని అంటున్నారు. ఇక మూగజీవాలకు కూడా ఆంజనేయుడు కరుణామయుడే. కనుక వాటిని బాధించకండి.

ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి:
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇంట్లోనూ, ఆలయాల్లోనూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు ప్రతీ కరమైన ప్రసాదాలను చేసి పెట్టడం వల్ల సామి అనుగ్రహం లభిస్తుందని, ఆయన ఆశీస్సులు ఉంటే ధైర్యం, శక్తితో పాటు ఆరోగ్యం, ఆనందం కలిసి వస్తాయని భక్తుల నమ్మకం. ఇక హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది వడమాల. దీనిని స్వామివారికి మాలలా వేయడం ద్వారా ఆయన కృప కలుగుతుందని భక్తుల నమ్మకం.
పరాక్రమానికి, భక్తికి నిలువెత్తిన ప్రతిమగా నిలిచే హనుమంతుడిని శుద్ధమైన హృదయంతో పూజిస్తే.. కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News