Hindu Festivals in August 2025: హిందువులకు వచ్చే ఆగస్టు నెల ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది. పైగా శ్రావణ మాసం నడుస్తోంది. పండుగలకు,నోములకు, వ్రతాలకు శ్రావణం శుభప్రదమైనది. రక్షా బంధన్, జన్మాష్టమి, వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, హర్తాలిక తీజ్ వంటి ముఖ్యమైన ఫెస్టివల్స్ ఇదే నెలలో రానున్నాయి.
ఆగస్టు నెల పండుగలు లేదా వ్రతాల లిస్ట్:
✫ ఆగస్టు 5: శ్రావణ పుత్రదా ఏకాదశి.
✫ ఆగస్టు 8: వరలక్ష్మీ వ్రతం.
✫ ఆగస్టు 9: రక్షా బంధన్, శ్రావణ పూర్ణిమ వ్రతం.
✫ ఆగష్టు 12: కజారి తీజ్, సంక్షోభ చతుర్థి.
✫ ఆగస్టు 15/16: జన్మాష్టమి
✫ ఆగస్టు 16: దహీ హండి, కాలాష్టమి
✫ ఆగస్టు 19: అజ ఏకాదశి
✫ ఆగస్టు 26: హర్తాళికా తీజ్.
✫ ఆగస్టు 27: గణేష్ చతుర్థి.
✫ ఆగస్టు 28: ఋషి పంచమి.
✫ ఆగస్టు 31: రాధా అష్టమి
Also Read: Solar Eclipse – ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?
వరలక్ష్మీదేవి వ్రతం
హిందూ వివాహిత స్త్రీలు జరుపుకునే ముఖ్యమైన పండుగ వరలక్ష్మీదేవి వ్రతం. దీనిని దక్షిణాది రాష్ట్రాలైన ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో వైభవంగా జరుపుకుంటారు. దీర్ఘసుమంగళిగా ఉండాలని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణంలోని శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఫెస్టివల్ ఈసారి ఆగస్టు 8న వచ్చింది.
రాఖీ పండుగ
సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. ఈసారి రక్షా బంధన్ ఆగస్టు 09న వచ్చింది. ఈరోజున సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు.
వినాయక చవితి
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. పది రోజులపాటు ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈరోజున గణపతిని 21 పత్రాలతో పూజిస్తారు. ఉండ్రాళ్లు నైవేద్యంగా పెడతారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ పండుగ ఆగస్టు 27న రాబోతుంది.

