ప్రయోగ్ రాజ్ మహాకుంభ మేళా (Kumbh Mela)సరికొత్త రికార్డులు సృష్టించింది. శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు( Holy baths) చేశారు. ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి 26వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. భారత్, చైనా దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జనాభా పాల్గొనలేదని వెల్లడించారు.
ఇక్కడ స్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా, ఇండోనేషియా, రష్యా, బ్రెజిల్, పాకిస్థాన్ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపింది. మరో వైపు మహాకుంభ మేళాకి రూ.1500 కోట్లు ఖర్చు పెడితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.