Navagraha Pooja Benefits: సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువులనే నవగ్రహాలు అంటారు. నవగ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు చేయడం హిందూ ఆచారాల్లో భాగం. అసలు నవగ్రహాలను ఎందుకు పూజించాలి? దాని వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకుందాం.
నవగ్రహాలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. చెడు ప్రభావం తగ్గి.. శుభ ఫలితాలు కలగాలంటే నవగ్రహ పూజ చేయాలని పండితులు, పెద్దలు చెబుతారు. ఎందుకంటే.. సూర్యుడు శక్తినీ, విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే.. చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసికంగా ధృడంగా ఉంచుతాడు. సమస్యలను ధైర్యంగా అధిగమించి శక్తిని కుజుడు ఇస్తాడు. బుధుడు జ్ఞానాన్ని ప్రసాదించి.. ఆలోచన పరిణతిని పెంచితే.. గురుడు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపజేస్తాడు.
Also read: Astrology -నేడే గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు భారీగా డబ్బు, ప్రమోషన్..
శుక్రుడు అందం, ఆనందం, ప్రేమ, విలాసాలు.. ఇలా జీవితానికి కావాల్సినవన్నీ శుక్రుడు అందిస్తాడు. మనం చేసే పనులకు తగిన ఫలితాలను ప్రసాదిస్తాడు శని. గతకాలపు కర్మలను కేతువు తగ్గిస్తాడట. మన జీవితంలో ఎదురయ్యే గందరగోళాన్ని రాహువు తొలగిస్తాడట. మన కష్టాలు తగ్గాలన్నా.. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్న నవగ్రహ పూజ చేయాలంటారు పండితులు.
నవగ్రహ ఉపాసన ఎలా చేయాలి?
నవగ్రహ ఉపాసనకూ ఓ ప్రత్యేక పద్ధతి ఉంది. ఏదైనా గుడికి వెళ్లినప్పుడు తొలుత నవగ్రహ మండపానికే వెళ్లాలి. ఈ క్రమంలో నవగ్రహ శ్లోకాలను పఠిస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. పదకొండు లేదా తొమ్మిది.. అదీ కుదరకపోతే సూర్యుడు నుంచి ప్రారంభించి సవ్వదిశలో మూడు ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి. ఆ సమయంలో నవ గ్రహాల విగ్రహాలను తాకకూడదట. ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక కాళ్లు కడుక్కుంటేనే దోషాలన్నీ పోతాయనుకుంటారు చాలా మంది, అది నిజం కాదు. నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకోవడం మంచిది.


