కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలంలో ఉంది. ఈ కొండగట్టు ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. స్వామివారికి తమ విలువైన కానుకలు సమర్పిస్తుంటారు తమ స్తోమతకు తగ్గట్టు. అనంతరం భక్తితో మెుక్కులు తీర్చుకుంటారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు కొండ గట్టు అంజన్నకు భారీ విరాళం సమర్పించారు. ఏఎంఆర్ చైర్మన్ మహేశ్వరరెడ్డి కోటి పది లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు వితరణగా అంజన్నకు భక్తి శ్రద్దలతో సమర్పించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బంగారు, వెండి ఆభరణాల తయారీకి దాదాపు ఒక రెండు కోట్ల పది లక్షల వరకూ ఖర్చయినట్లు వివరించారు.
సంప్రోక్షణ అనంతరం స్వామివారికి నూతన ఆభరణాలను అర్చకులు అలంకరించారు. అనంతరం మహేశ్వరరెడ్డి దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి మూలవిరాట్‌కు బంగారు కిరీటాన్ని బహూకరించారు. సీతారాముల విగ్రహం, 55 కిలోల వెండితో మకర తోరణం, గర్భాలయ ద్వారాలకు తొడుగులను విరాళంగా అందిచినట్లు అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా దాత మహేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సత్కరించి, అనంతరం ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు.
.