Sunday, September 29, 2024
HomeదైవంHyd: ఘనంగా మార్వాడి బచ్ బారస్ పండగ

Hyd: ఘనంగా మార్వాడి బచ్ బారస్ పండగ

అతిథులుగా పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్

మార్వాడి మహిళా మండల్ సమాజ్ ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో మార్వాడీల బచ్చబారస్ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి ఆరవ రోజున బచ్చ బరస్ పండుగ సందర్భంగా మార్వాడి మహిళా సమాజంతో కలసి గోమాతను ప్రత్యేకంగా పూజించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ మార్వాడి సమాజం మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు అందరూ కలిసికట్టు బచ్చబరస్ కార్యక్రమాన్ని నిర్వహించడం మహిళల ఐక్యతకు మార్వాడీల సాంప్రదాయ చిహ్నం అని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ బచ్చబారస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల
ప్రవీణ్ ముదిరాజ్, బన్సిలాల్, రామచందర్, గణపతి లాల్, సురేష్ చంద్, మనిక్చంద్, సమాజ్ మార్వాడి మహిళా సంఘం సభ్యులు శ్రీమతి సంతోష్ దేవి, తారాదేవి, రుక్మాదేవి, రేఖాదేవి, ఇంద్రాదేవి, మునిదేవి, కుమావత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News